Taliban : భారత్‌‌ను మెచ్చుకుని.. పాక్‌‌పై తాలిబన్ అధికారి విమర్శలు!, ఎందుకంటే

భారతదేశాన్ని మెచ్చుకుని పాక్ పై తాలిబన్ అధికారి విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ పంపిన గోధుమల నాణ్యత పట్ల భేష్ అంటున్నారు. పాకిస్థాన్ నాసిరకం గోధుమలు...

Taliban : భారత్‌‌ను మెచ్చుకుని.. పాక్‌‌పై తాలిబన్ అధికారి విమర్శలు!, ఎందుకంటే

India Wheat

Donating Inedible Wheat : భారతదేశాన్ని మెచ్చుకుని పాక్ పై తాలిబన్ అధికారి విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ పంపిన గోధుమల నాణ్యత పట్ల భేష్ అంటున్నారు. పాకిస్థాన్ నాసిరకం గోధుమలు ఇచ్చిందంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. తాలిబన్ అధికారి ఫిర్యాదు చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Arun (@arunpudur) నెటిజన్ ట్వీట్ చేశారు. పాక్ విరాళంగా ఇచ్చిన గోధుములు తినడానికి పనికి రావని విమర్శలు గుప్పించారు. అప్ఘాన్ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. ఈ వ్యాఖ్యలు చేసిన తాలిబన్ అధికారిని పోస్టు నుంచి తొలగించినట్లు సమాచారం.

Read More : Taliban ban foreign currency : అఫ్ఘానిస్థాన్ లో విదేశీ కరెన్సీపై నిషేధం విధించిన తాలిబన్లు

ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. నాణ్యమైన గోధుమలు పంపినందుకు భారత్ కు ధన్యవాదాలు తెలియచేస్తున్నారు. అప్ఘన్ ప్రజలకు మద్దతు తెలియచేసినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు, స్నేహపూర్వక సంబంధాలు ఎప్పటికీ ఉంటాయి.. జై హింద్ అంటూ Hamdullah Arbab ట్వీట్ చేశారు. పాక్ ఇచ్చిన గోధుమలు ఉపయోగించని స్థితిలో ఉన్నాయని, అప్ఘాన్ కు భారత్ ఎప్పుడూ సాయం చేస్తూనే ఉందని మరో నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాలిబన్లు వశం చేసుకున్న తర్వాత అప్ఘనిస్తాన్ లో దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆకలికి అలమటిస్తున్నారు. ఆర్థికంగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో భారతదేశం మానవతాదృక్పథంతో స్పందించింది.

Read More : Afghanistan – India: అతి త్వరలో భారత్ నుంచి పాక్ మీదుగా ఆఫ్ఘన్‌కు చేరనున్న గోధుమలు

50 వేల టన్నుల గోధుమలను పంపించేందుకు అంగీకరించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో కరువుకు ప్రజలు పడుతున్న బాధల్ని భారత్ చలించిపోయింది. చైనా, టర్కీ వంటి కొన్ని దేశాలు గత కొన్ని వారాలుగా ఆఫ్ఘన్‌లకు ఆహారాన్ని సరఫరా చేయడం ప్రారంభించాయి. అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం గురించి పక్కన పెడితే ఆ దేశ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్న భారత్ కూడా తన వంతుగా సహాయం అందించాలనుకుంది. దాంట్లో భాగంగానే భారీ మొత్తంలో ఆహార ధాన్యాలను అందించాలనుకుంది. అందుకే గోధుమలను భూమార్గంలో పంపిస్తోంది. మొదటి కాన్వాయ్ పంపిన అనంతరం రెండో కాన్వాయ్ లో 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను అప్ఘాన్ కు పంపించింది. అమృత్ సర్ లోని అత్తారి నుంచి అప్ఘాన్ లోని జలాలాబాద్ కు బయలుదేరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.