Afghanistan Crisis : తలొగ్గిన అప్ఘాన్‌ సేన.. తాలిబన్ల విజయానికి కారణం ఇదేనా!

తాలిబన్లకు అప్ఘాన్ సేన తలొగ్గింది. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు అప్ఘానిస్తాన్ రాజ్యాన్ని కట్టబట్టింది. ఇంతకీ తాలిబన్ల విజయానికి కారణం ఏంటి?

Afghanistan Crisis : తలొగ్గిన అప్ఘాన్‌ సేన.. తాలిబన్ల విజయానికి కారణం ఇదేనా!

Afghanistan Crisis, Taliban Victory, Afghanistan, Two Decades American Intervention

Updated On : August 17, 2021 / 8:52 AM IST

Taliban victory in Afghanistan : తాలిబన్లకు అప్ఘాన్ సేన తలొగ్గింది. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు అప్ఘానిస్తాన్ రాజ్యాన్ని కట్టబట్టింది. ఇంతకీ తాలిబన్ల విజయానికి కారణం ఏంటి? అనే ప్రశ్నకు ఒకే సమాధానం వినిపిస్తోంది.. అదే అవినీతి.. ఇదే మాట ఎక్కువగా వినిపిస్తోంది. అందుకే తాలిబన్ల విజయం సునాయసమైందనే వాదన వినిపిస్తోంది. 20ఏళ్ల పాటు పాశ్చాత్య బలగాల శిక్షణ, అమెరికా, నాటో సేనలు అందించిన ఆయుధాలు, 3.5 లక్షలకుపైబడిన బలగం ఉన్నప్పటికీ తాలిబన్లపై ప్రతిఘటించేందుకు అఫ్గాన్‌ సేన ముందుకు రాలేదు. బలగాలు ఖాళీ చేసిన నెల రోజుల్లో దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకుంటారనే అమెరికా భావించింది. కానీ, అగ్రరాజ్యం అంచనాలను తలకిందులు చేస్తూ 10 రోజుల్లోనే అప్ఘాన్‌ సైన్యం తాలిబన్లకు లొంగిపోయింది.

అప్ఘా‌న్‌ సైన్యంలో అవినీతిమయం పెరిగిపోయి.. సామాన్య సైనికుడి నుంచి ఉన్నతాధికారి వరకు లంచాలు మరిగారు. ప్రపంచ దేశాలు ఇచ్చిన నిధులన్నీ కాజేశారు. తాలిబన్ల ఆక్రమణతో సైన్యమంతా చేతులెత్తేసింది. రెండు దశాబ్దాలుగా అఫ్గాన్‌లో అవినీతి చూసి సైన్యం విస్తుపోయింది. తమ దేశ బలగాలకు లంచమనే కేన్సర్‌ రోగం పట్టిందని ఆ దేశ ఇనస్పెక్టర్‌ జనరల్ అన్నారంటూ యూఎస్‌ కాంగ్రెస్‌ నివేదిక అంటోంది. ఈ నేపథ్యంలో అప్ఘాన్‌ భద్రతకు దాదాపు 880 కోట్ల డాలర్లను అమెరికా, నాటో బలగాలు వెచ్చించాయి. అదంతా నిరూపయోగమైంది.

చేతులేత్తేసిన ఎయిర్ ఫోర్స్ : 
మరోవైపు.. సాయం చేయాల్సిన అప్ఘా‌న్‌ ఎయిర్‌ఫోర్స్‌ సైతం చేతులెత్తింది. అప్ఘా‌న్‌ వైమానిక దళంలో 211 విమానాలున్నాయి. దీన్ని నడిపే అవసర సిబ్బంది, నేతలు లేరు. దాంతో కాబూల్‌లోకి తాలిబన్లు ఎంటర్ అయినా ఒక్క యుద్దవిమానం రంగంలోకి దిగలేదు. ఇప్పటికే తాలిబన్లతో జరిగిన యుద్ధాల్లో ఎక్కువమంది గాయపడడం, తగినంత స్థాయిలో సైన్యం లేకపోవడం ఓటమికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్ఘా‌న్‌ బలగాల్లో అవినీతి మాత్రమే తాలిబన్ల విజయానికి కారణం కాదనేది నిపుణుల వాదన. ఎందుకంటే.. తాలిబన్లను గట్టిగా వ్యతిరేకించిన స్థానిక తెగల నేతలు, ప్రజలే తాలిబన్లకు సాయం చేశారు.

రెండు దశాబ్దాలు అమెరికా ఆధ్వర్యంలోనే పాలన జరగడం తెగలకు నచ్చలేదు. దాంతో తాలిబన్లు వీరిందరిని తమకు అనుగుణంగా మార్చుకున్నారు. ఎలాంటి రక్తపాతం జరగకుండానే తాలిబన్లకు విజయం లభించింది. వాస్తవానికి తాలిబన్ల విజయానికి పాకిస్తాన్ మద్దతు కూడా ఒక కారణమే. అంతేకాదు.. సౌదీ నుంచి వచ్చిన విరాళాలు, యూఏఈ, ఖతార్, రష్యా, చైనాల పరోక్ష సాయం, ఆదాయం పెరగడం కూడా వంటి ఇతర కారణాలు కూడా తాలిబన్లకు విజయాన్ని అందించాయి.