Afghanistan: ఆఫ్గనిస్తాన్‌లో చైనా గెస్ట్‌హౌజ్‌పై ఉగ్రదాడి.. ఇద్దరిని కాల్చి చంపిన భద్రతా దళాలు

ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం మరోసారి కాల్పుల మోత, పేలుళ్లతో దద్దరిల్లింది. చైనీయులు ఎక్కువగా ఉండే ఒక హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కాల్పులు జరిపారు.

Afghanistan: ఆఫ్గనిస్తాన్‌లో చైనా గెస్ట్‌హౌజ్‌పై ఉగ్రదాడి.. ఇద్దరిని కాల్చి చంపిన భద్రతా దళాలు

Afghanistan: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. చైనా వ్యాపారులు అత్యధికంగా వచ్చే కాబూల్ నగరంలోని షహర్-ఇ నావ్ అనే ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం కాల్పులు, పేలుళ్లు జరిగాయి. ఇది చైనా ధనవంతులు ఎక్కువగా ఉండే అత్యంత రద్దీ ప్రాంతం.

Rs 2000 Notes: మూడేళ్లక్రితమే ఆగిపోయిన రూ.2000 నోట్ల ప్రింటింగ్.. దశలవారీగా నోట్ల రద్దు: బీజేపీ ఎంపీ వెల్లడి

చైనీయులు అధికంగా ఉండే ఈ హోటల్‌లోకి ఆయుధాలతో చొరబడ్డ కొందరు దుండగులు కాల్పులు జరిపారు. పేలుళ్లకు పాల్పడ్డారు. ఘటన సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. చాలా సేపు ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇస్లామిక్ ఎమిరేట్స్‌కు సంబంధించి జబిహుల్లా అనే ప్రతినిధి మీడియాకు వివరాలు వెల్లడించాడు. షహర్-ఇ నావ్ ప్రాంతంలోని హోటల్‌పై దుండగులు దాడి చేసినట్లు ఆయన చెప్పాడు. అయితే, వెంటనే సైన్యం స్పందించిందని, దాడికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులు ఎదురు కాల్పుల్లో మరణించారని ఆయన వెల్లడించాడు. ఈ ఘటనలో హోటల్‌లోని విదేశీయులెవరూ ప్రాణాలు కోల్పోలేదని, అందరూ సురక్షితంగానే ఉన్నారని తెలిపాడు.

Viral Video: సింహాలతో అడుకుంటున్న బాలుడు.. చెయ్యి ఎలా కొరికిందో చూడండి.. వీడియో వైరల్

అయితే, తమను తాము రక్షించుకునేందుకు హోటల్ గది వెనుకవైపు నుంచి దూకేందుకు ప్రయత్నించిన ఇద్దరు విదేశీయులు మాత్రం గాయపడ్డారని తెలిపాడు. కాగా, గతేడాది ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ ఉగ్రదాడులు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా పాక్-ఆఫ్గాన్ సరిహద్దులోనూ కాల్పులు జరుగుతున్నాయి. తాజా ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.