Thailand : గంజాయిని చట్టబద్ధం చేసిన థాయిలాండ్..10 లక్షల మొక్కలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం

గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా థాయిలాండ్ నిలిచింది. గంజాయి సాగును..వినియోగాన్ని చట్టబద్దం చేసిన థాయ్ లాండ్ ప్రభుత్వం 10 లక్షల మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

Thailand : గంజాయిని చట్టబద్ధం చేసిన థాయిలాండ్..10 లక్షల మొక్కలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం

Thailand Just Decriminalized Cannabis (3)

Thailand just decriminalized cannabis : గంజాయి అంటే ఓ మత్తు..ఓవ్యసనం..ఎంతో జీవితాలను నాశనం చేస్తున్న నిషా మహమ్మారి. అటువంటి గంజాయిని కొనటం..విక్రయటించటం..భారత్ లో చట్టరీత్యా నేరం. కానీ ఆసియా దేశాల్లో ఒకటైన థాయిలాండ్ మాత్రం గంజాయి విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. గంజాయిని ఏకంగా చట్టబద్దం చేసేసింది. గంజాయిని పండించటం..గంజాయిని వినియోగించటాన్ని చట్టబద్ధం చేసినట్లుగా ప్రకటించింది. గురువారం (జూన్ 9,2022) థాయ్ లాండ్ ఆరోగ్య మంత్రి అనుతిన్న చార్న్ విరాకుల్ ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు.

గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా థాయ్ లాండ్ రికార్డులకెక్కింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గురువారం నుంచే థాయ్ లాండ్ లోని షాపులు, కేఫ్ లతో విక్రయాలు ప్రారంభమయ్యాయి. గంజాయిని చట్టబద్దం చేయటంతో కొంతమంది థాయ్ న్యాయవాదులు గురువారం ఉదయం ఓ కేఫ్ లో గంజాయిని కొని సంబరాలు జరుపుకున్నారు.

కానీ ఇక్కడో విషయం గమనించాలి. అదేమంటే..గంజాయిని బహిరంగ ప్రదేశాల్లో తాగడాన్ని నిషేధించారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే జైలుశిక్ష తప్పదని హెచ్చరించింది ప్రభుత్వం. గంజాయిని చట్టబద్దం చేసిన దేశం బహిరంగ ప్రదేశాల్లో వినియోగిస్తే మాత్రం మూడు నెలల జైలు శిక్ష..రూ. 60 వేల జరిమానా తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. గంజాయి ఇప్పుడు చట్టబద్ధం కావడంతో గతంలో ఈ కేసుల్లో అరెస్ట్ అయిన దాదాపు 4 వేల మందిని ప్రభుత్వం విడుదల చేయనుంది.

వైద్య పరమైన ఉపయోగాల కోసమే గంజాయిని చట్టబద్ధం చేసే నిర్ణయం తీసుకున్నామని థాయిలాండ్ ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు..నేటి నుంచి దేశవ్యాప్తంగా 10 లక్షల గంజాయి మొక్కలు పంపిణీ చేయాలని ఆ దేశ ఆరోగ్య మంత్రి అనుతిన్ చార్న్ విరాకుల్ నిర్ణయించారు.