Arctic : ప్రపంచానికి పెను ముప్పు..ఆర్కిటిక్ మంచు పలకలో భారీ గొయ్యి

ప్రపంచానికి పెను ముప్పు పొంచివుంది. ఆర్కిటిక్ లోని పురాతన మంచు పలకలో 100 కిలో మీటర్ల మేర భారీ గొయ్యి ఏర్పడింది. భారీ మంచు పలకలో గొయ్యి కారణంగా పగుళ్లు ఏర్పడ్డాయి.

Arctic : ప్రపంచానికి పెను ముప్పు..ఆర్కిటిక్ మంచు పలకలో భారీ గొయ్యి

Pit

Huge pit in arctic ice sheet : ప్రపంచానికి పెను ముప్పు పొంచివుంది. ఆర్కిటిక్ లోని పురాతన మంచు పలకలో భారీ గొయ్యి ఏర్పడింది. 100 కిలో మీటర్ల మేర గొయ్యి విస్తరించి ఉంది. భారీ మంచు పలకలో గొయ్యి కారణంగా పగుళ్లు ఏర్పడ్డాయి. ఇది ఆ మంచు పలక విరిగిపోవడానికి కారణమై, ఆ మంచు పూర్తిగా కరిగిపోయి సముద్రాల్లో కలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో సముద్ర నీటి మట్టాలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

దీనిని పోలిన్యాగా పిలుస్తారు. ఇది 1988, 2004లోనూ కనిపించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ లోనూ ప్రచురించారు. కెనడాకు సమీపంలోని మంచు పలకలో భారీ గొయ్యి ఏర్పడింది. ఈ గొయ్యి 100 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. ఉత్తర ధృవంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఇక్కడి మంచు ప్రమాదంలో పడింది.

#FliporFoldchallenge: సామ్‌సంగ్ కోసం యోహాని ఫ్లిప్ ఆర్ ఫోల్డ్ ఛాలెంజ్!

ఈ శతాబ్ధం చివరిలోపు ఇక్కడి చివరి ముంచు పలక కూడా పూర్తిగా కరిగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది ఆర్కిటిక్, ఉత్తర ధృవాల్లో నివసిస్తున్న జీవరాశుల అంతానికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.

కాగా గతేడాది మే నెలలో వచ్చిన భారీ తుఫాన్ కారణంగా ఈ గొయ్యి ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గొయ్యికి సంబంధించిన ఫొటోలను శాటిలైట్ ద్వారా తీశారు. ఇది 100 కిలో మీటర్ల పొడవు, 30 కిలో మీటర్ల వెడల్పు ఉన్నట్లు గుర్తించారు.