Suez Canal Traffic: సూయెజ్ కాలువలో మరోసారి ట్రాఫిక్ జాం…!

సూయెజ్ కాలువ మరోసారి బ్లాక్ అయిందని చెబుతున్నారు. గతంలో ఎవర్‌గ్రీన్ నౌక అడ్డుగా నిలిచినట్లుగా వాతావరణం మారిపోయిందని ఈజిప్షియన్ అధికారులు చెబుతున్నారు.

Suez Canal Traffic: సూయెజ్ కాలువలో మరోసారి ట్రాఫిక్ జాం…!

Suez Canal

Suez Canal Traffic: సూయెజ్ కాలువ మరోసారి బ్లాక్ అయిందని చెబుతున్నారు. గతంలో ఎవర్‌గ్రీన్ నౌక అడ్డుగా నిలిచినట్లుగా వాతావరణం మారిపోయిందని ఈజిప్షియన్ అధికారులు చెబుతున్నారు. సకాలంలో స్పందించి భారీ నష్టం నుంచి తప్పించగలిగారని సమాచారం.

సూయెజ్ కెనాల్ అథారిటీ స్టేట్మెంట్ ప్రకారం.. ‘పనామా జెండాతో ఉన్న భారీ నౌకను దాటి ప్రయాణించాల్సిన మిగిలిన వాటి దారి మళ్లించారు. మరో లైన్ గుండా పంపించి నష్టం జరగకుండా చూస్తున్నాం’ అని ఉంది. దక్షిణ దిశగా ప్రయాణిస్తున్న నౌకలో 43వేల టన్నుల సామాగ్రి ఉన్నట్లు చెబుతున్నారు.

కెనాల్ గుండా రోజూ రెండు నౌకలు ప్రయాణిస్తుంటాయి. ఒకటి మధ్యధరా సముద్రానికి ఉత్తర దిశగా వెళితే, మరొకటి ఎర్ర సముద్రానికి దక్షిణ దిశగా ప్రయాణిస్తాయి.

సూయెజ్ కెనాల్ హెడ్.. అడ్మిరల్ ఒసామా రబీ మాట్లాడుతూ.. కల్గిన అసౌకర్యాన్ని ప్రొఫెషనల్ పద్ధతిలో సాల్వ్ చేశామని అన్నారు. జార్జ్ సఫ్వాత్ అనే అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. గురువారం మొత్తం 61 నౌకలు ప్రయాణించి 3.2 మిలియన్ టన్నుల సామాగ్రిని రవాణా చేశాయని అన్నారు.

Read Also : పెట్రోల్ పోయించుకుంటున్నారా ? గమనించండి..మోసపోకండి

కెనాల్ లో ఎటువంటి ట్రాఫిక్ ఆగిపోలేదు. ఎందుకంటే మరో వాటర్ వే గుండా దానిని మళ్లించాం అని చెప్పారు. మార్గానికి అడ్డుగా తిరగబోయిన నౌకలో సమస్యను బయటపెట్టలేదు అధికారులు. ఆ నౌకను 2012 నిర్మించగా 738 అడుగుల పొడవు 104అడుగుల వెడల్పుతో ఉంటుంది. సూడాన్ పోర్టు నుంచి ఎర్ర సముద్రానికి వెళ్తుంటుంది.