Planet Parade: వెయ్యేళ్ల తరువాత ఆకాశంలో అద్భుతం.. ఒకే వరుసలోకి నాలుగు గ్రహాలు

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఏప్రిల్ 26, 27 తేదీల్లో అరుదైన గ్రహాల కూర్పు కనిపించింది. తూర్పున సూర్యోదయానికి ముందు శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వచ్చాయి....

Planet Parade: వెయ్యేళ్ల తరువాత ఆకాశంలో అద్భుతం.. ఒకే వరుసలోకి నాలుగు గ్రహాలు

Planet Parade

Planet Parade: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఏప్రిల్ 26, 27 తేదీల్లో అరుదైన గ్రహాల కూర్పు కనిపించింది. తూర్పున సూర్యోదయానికి ముందు శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వచ్చాయి. వెయ్యేళ్లకు ఇలాంటి ఘటన ఆవిష్కృతమైంది. క్రీ. శ. 1947లో చివరిసారిగా ఇటువంటి ఘటన జరిగిందని భవనేశ్వర్ లోని పఠాని సమంత ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్​ సువేందు పట్నాయక్​ వెల్లడించారు. అయితే ఇలా ఒకే వరుసలోకి నాలుగు గ్రహాలు రావడాన్ని ప్లానెట్ పెరేడ్ అని పిలుస్తారని ఆయన తెలిపారు. ఈ పదానికి శాస్త్రీయ నిర్వచనం లేనప్పటికీ సౌర వ్యవస్థ యొక్క గ్రహాలు వరుసగా ఒకే వరుసలో ఉన్నప్పుడు జరిగే సంఘటనను సూచించడానికి ఖగోళ శాస్త్రంలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారని పట్నాయక్ అన్నారు.

NASA 5000 Exoplanets : మన సౌర‌వ్య‌వ‌స్థ‌ అవతల 5వేల గ్ర‌హాలు.. నాసా 3D వీడియో చూడండి..!

‘ప్లానెట్ పెరేడ్’ మూడు రకాలుగా ఉంటుందని పట్నాయక్ వెల్లడించారు. సూర్యుడు ఒకవైపు, మూడు గ్రహాలు ఒకవైపు ఒకే వరుసలో ఉన్నప్పుడు మొదటి రకమైన గ్రహ వరుస క్రమంగా పేర్కొంటారని, ఇలాంటి సంఘటనలు సంవత్సరంలో చాలా సార్లు మనం చూడొచ్చని తెలిపారు. అయితే నాలుగు గ్రహాల వరుస క్రమం అరుదుగా ఏర్పడుతుందని, నాలుగు, ఐదు గ్రహాలు ఒకే వరుసలోకి రావడం ప్రతి 19ఏళ్లకు ఒకసారి జరుగుతుందని ఆయన తెలిపారు. సౌర వ్యవస్థలోని మొత్తం ఎనిమిది గ్రహాల అమరిక చాలా అరుదుగా ఒకే వరుసలోకి వస్తాయని, దాదాపు 170 సంవత్సరాలకు ఒకసారి అలా జరుగుతుందని పట్నాయక్ తెలిపారు. అయితే నాలుగు గ్రహాల వరుస క్రమం ఆకాశంలో ఆవిష్కృతం కావడానికి వెయ్యేళ్లు పట్టిందని అన్నారు.

Alien Planets: “5,000 గ్రహాల్లో ఏలియన్స్”?.. అమెరికా అంతరిక్ష పరిశోధకుల వింత వాదన

మూడవ రకం గ్రహాల వరుసక్రమం అరుదైన సందర్భాలలో జరుగుతుందని తెలిపారు. అయితే అన్ని, కొన్ని గ్రహాలను పరిశీలించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, ఒక సంవత్సరంలో గ్రహాలను ఏకకాలంలో గమనించడానికి చాలా సందర్భాలు ఉంటాయని తెలిపారు. 2022 ఏప్రిల్ 26, 27 తేదీల్లో జరిగిన అరుదైన ఖగోళ సంఘటన అరుదైన సందర్భాలలో జరిగే మూడవ రకమైన గ్రహ వరుస క్రమమని పట్నాయక్ చెప్పారు. ఏప్రిల్ 30న అత్యంత ప్రకాశవంతమైన గ్రహాలు అయిన శుక్రుడు, బృహస్పతి ఒకదానికొకటి చాలా దగ్గరగా చూడవచ్చునని, శుక్రుడు బృహస్పతికి దక్షిణంగా 0.2 డిగ్రీల దూరంలో ఉంటాడని పట్నాయక్ తెలిపారు.