Letter Reached After 30 years : తపాలా శాఖ ఘనకార్యం..30 ఏళ్ల తర్వాత అందిన ఉత్తరం..! రాసినవారు,అందుకోవాల్సిన ఇద్దరూ..

పోస్టల్ డిపార్ట్ మెంట్ వారి పుణ్యమా అని ఓ ‘ఉత్తరం’ ఒకటీ రెండూ కాదు ఏకంగా మూడు దశాబ్దాలకు అందింది. అంటద 30 ఏళ్లకు అందింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే..ఈ ‘ఉత్తరం’రాసినవారు..అందుకోవాల్సినవారు కూడా ..

Letter Reached After 30 years : తపాలా శాఖ ఘనకార్యం..30 ఏళ్ల తర్వాత అందిన ఉత్తరం..! రాసినవారు,అందుకోవాల్సిన ఇద్దరూ..

Letter reach im destination almost 30 years afta dem send

Updated On : January 23, 2023 / 1:45 PM IST

Letter Reached After 30 years : సోషల్ మీడియా అందరికి అందుబాటులోకి వచ్చాక క్షణాల్లో సమాచారం అందిపోతోంది. కానీ ఒకప్పుడు సమాచారం అందాలంటే ‘ఉత్తరాలు’ ఆధారంగా ఉండేవి. ఇప్పుడు ఉత్తరాల జాడే కనిపించటంలేదు.ఉత్తరాలు అందాలంటే కూడా కొన్ని రోజులు పట్టేది. ఈ ఉత్తరాల కాలంలో పోస్టల్ డిపార్ట్ మెంట్ పై ఎన్నో సెటైర్లు ఉండేవి. పెళ్లికి శుభలేఖ పంపిస్తే వారికి పెళ్లి అయి పిల్లలు పుట్టి బారసాల సమయానికి అందేవి అని..కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్త మాత్రం దీనికి బాబులాంటిది. పోస్టల్ డిపార్ట్ మెంట్ వారి పుణ్యమా అని ఓ ‘ఉత్తరం’ ఒకటీ రెండూ కాదు ఏకంగా మూడు దశాబ్దాలకు అందింది. అంటే..30 ఏళ్లకు అందింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే..ఈ ‘ఉత్తరం’రాసినవారు..అందుకోవాల్సినవారు కూడా చనిపోయారు. మరి ఇప్పుడు చెప్పండి ఇది పోస్టల్ శాఖ ఘన కార్యమా? కాదా?.. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని నెలకొల్పిన గ్రేట్ బ్రిటన్ లో జరిగిందీ ఘటన. పోస్ట్ చేసిన 30 ఏళ్లకు అందింది ఓ ‘ఉత్తరం’..!!

యూకేలోని నార్తంబర్‌ల్యాండ్‌కు చెందిన 60 ఏళ్ల జాన్ రెయిన్‌బో అనే వ్యక్తికి పోస్టల్ శాఖ ఓ లెటర్ అందించింది. అది చూసిన అతగాడు షాకయ్యాడు. ఎందుకంటే ఆ ఉత్తరం 1995లో పోస్టు చేసిన లెటర్ అది. మరో విషయం ఏమిటంటే ఈ లెటర్ రాసినవారు అందుకోవాల్సిన వారు కూడా చనిపోయారు. జాన్ కంటే ముందు ఆ ఇంట్లో ఇంతకుముందు నివసించిన వెలెరీ జార్విస్ రీడ్‌ అనే వ్యక్తికి ఈ ఉత్తరం అందాల్సి ఉంది. కానీ ఇప్పుడాయన లేరు. అందుకే ఆ ఇంట్లో ప్రస్తుతం నివసించే జాన్ ఆ ఉత్తరాన్ని అందుకున్నారు. లెటర్ మీద ఉన్న పోస్ట్ చేసిన తేదీని బట్టి ఆ ఉత్తరం 30 ఏళ్ల క్రితం పోస్ట్ చేసినది అని గుర్తించి షాక్ అయ్యారు.

రిటైర్ అయిన తరువాత జాన్ రెయిన్‌బో 2015 నుంచి తన భార్యతో కలిసి వైలామ్‌లోని ప్రస్తుతం ఉన్న ఇంట్లోనే ఉంటున్నారు. ఆ లెటర్ 1880కాలంనాటిది. ఆ లెటర్ అందుకోవాల్సిన సదరు వ్యక్తి లేరు కాబట్టి జాన్ ఆ లెటర్ ఓపెన్ చేయగా దాంట్లో రాసిన వ్యక్తి, ఆ లెటర్ అందుకోబాల్సిన వ్యక్తి చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఉందని..తన పిల్లలు ఎలా పెరిగిందీ అందులో రాసి ఉందని తెలిపారు.

కాగా 30 ఏళ్ల క్రితం అందాల్సిన ఈ లెటర్ అందుకున్న జాన్ రెయిన్ బో మొదట్లో దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ లెటర్ ను క్రిస్మస్ కార్డు అనుకున్నారట. కానీ అది చాలా పాత ఉత్తరం గుర్తించాక అసలు దాంట్లో ఏముందో తెలుసుకోవాలని ఆసక్తి పెరిగిందట. అలా ఆ ఉత్తరం ఓపెన్ చేసిన చదివిన జాన్ కు చాలా ఆశ్చర్యకరం అనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాల దొంతర కళ్లముందు మెదిలేలా ఆ ఉత్తరం ఉందని తెలిపారు. కానీ ఇదే ఇంటిలో 30 ఏళ్ల క్రితం నివసించిన వ్యక్తి వెలెరీ జార్విస్ రీడ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని..ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదని కానీ ఈ లెటర్ ద్వారా ఆయన గుర్తుకొచ్చారని రెయిన్‌బో తెలిపారు.