Taiwanese maths teacher : అశ్లీల వెబ్ సైట్ లో లెక్కల పాఠాలు చెబుతూ కోట్లు సంపాదిస్తున్న టీచర్
పోర్న్‌హబ్ అనే బూతు సైట్‌లో గణితాన్ని బోధిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఓ లెక్కల మాస్టారు. ఈ మాస్టారు పాఠాలని లక్షల మంది ఆసక్తిగా చూస్తున్నారు. అతడి వీడియోలకు

Teacher
Taiwanese maths teacher పోర్న్‌హబ్ అనే బూతు సైట్‌లో గణితాన్ని బోధిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఓ లెక్కల మాస్టారు. ఈ మాస్టారు పాఠాలని లక్షల మంది ఆసక్తిగా చూస్తున్నారు. అతడి వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో ఏటా రూ.2 కోట్లకుపైగా ఆదాయం అతనికి సమకూరుతోంది.
వాన్ కు చెందిన చాంగ్షూ అనే గణిత ఉపాధ్యాయుడు అశ్లీల సైట్లలో తన లెక్కల పాఠాలను అప్ లోడ్ చేస్తే చాలా మంది చూస్తారన్న కొత్త ఆలోచనతోనే పోర్న్‌హబ్‌లో ‘changshumath666’ వెరిఫైడ్ అకౌంట్‌తో పాఠాలను బోధిస్తున్నారు. ‘కష్టపడి ఆడండి, కష్టపడి చదవండి’ అనే సందేశంతో అతడి వీడియోలు కనిపిస్తాయి. తన వీడియోలకు ఏడాది రూ. 2కోట్లకు పైగా ఆదాయం సమకూరుతున్నట్టు చాంగ్షూ తెలిపారు. ఒక్క పోర్న్‌హబ్‌లోనే కాదు.. పలు పోర్న్ వెబ్‌సైట్లలోనూ పాఠాలు చెప్పేందుకు ఆయన ప్రయత్నించినా అది ఫలించలేదు. ఎందుకంటే ఇతర వెబ్‌సైట్లు నాన్-అడల్ట్ వీడియోలను పోస్ట్ చేయడానికి అంగీకరించకపోవడమే కారణం.
‘అడల్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో చాలా తక్కువ మంది గణితాన్ని బోధిస్తారు.. లెక్కల వీడియోలు చూసేవారు చాలా మంది ఉంటారు కాబట్టి నా వీడియోలను అక్కడ అప్‌లోడ్ చేస్తే చాలా మంది వాటిని చూస్తారని భావించాను అని మెల్ మ్యాగిజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాంగ్షూ తెలిపారు. అయితే, అడల్ట్ సైట్‌లో గణితాన్ని బోధించాలన్నది తన ఉద్దేశం కాదని, కానీ కాల్క్యులస్ బాగా చెప్పే తైవాన్ టీచర్ ఇతను అని ప్రపంచం తనను గుర్తించేందుకే ఇలా చేస్తున్నానని చాంగ్షూ తెలిపారు. కొత్తదనం కావాలనుకునే చాలా మంది అడల్ట్ సైట్‌లో తన వీడియోలను చూస్తారని గర్వంగా చెప్పుకుంటున్నారు. తన వీడియోలంటే ఎవరికీ నచ్చకపోయినా.. ‘అడల్ట్ సైట్’ టీచర్ పాఠాలంటే ఎంతో మంది ఆసక్తిగా చూస్తారని అన్నారు.
ALSO READ Japanese princess : రాచరిక హోదా వదులుకొని..సామాన్యుడిని పెళ్లాడిన జపాన్ యువరాణి