Japanese princess : రాచరిక హోదా వదులుకొని..సామాన్యుడిని పెళ్లాడిన జపాన్ యువరాణి

జ‌పాన్ యువ‌రాణి "మాకో" ఎట్ట‌కేల‌కు పెళ్లి పీట‌లెక్కింది. ప్రేమ కోసం రాచ‌రిక‌పు హోదాను వదిలి ప్రియుడు కొమ‌రోను పెళ్లాడింది. మంగళవారం ఉదయం రాజమహల్‌ను విడిచిపెట్టిన మాకో..

Japanese princess :  రాచరిక హోదా వదులుకొని..సామాన్యుడిని పెళ్లాడిన జపాన్ యువరాణి

Japan (1)

Japanese princess జ‌పాన్ యువ‌రాణి “మాకో” ఎట్ట‌కేల‌కు పెళ్లి పీట‌లెక్కింది. ప్రేమ కోసం రాచ‌రిక‌పు హోదాను వదిలి ప్రియుడు కొమ‌రోను పెళ్లాడింది. మంగళవారం ఉదయం రాజమహల్‌ను విడిచిపెట్టిన మాకో.. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కొమురోను వివాహం చేసుకున్నారు.

మాకో-కొమురో వివాహ ప‌త్రాన్ని పాలెస్ అధికారులు ఇవాళ ఉద‌యం స‌మ‌ర్పించిన‌ట్లు ఇంపీరియ‌ల్ హౌజ్‌హోల్డ్ ఏజెన్సీ(జపాన్ ప్రభుత్వ ఏజెన్సీ) తెలిపింది. వివాహానికి సంబంధించి ఎలాంటి విందులు, ఆచారాలు కానీ నిర్వహించలేదని వెల్ల‌డించింది. నిజానికి మూడేళ్ల క్రితమే వారి వివాహం జరగాల్సి ఉండగా తల్లితో ఆర్థికపరమైన వివాదాల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే.

కీ కొమురోను పెళ్లాడిన యువరాణి మాకో తన రాచరిక హోదాను కోల్పోయారు. జపాన్ రాజవంశం సంప్రదాయం ప్రకారం… రాజవంశం వెలుపల వివాహం చేసుకున్నందుకు యువరాణి మాకో తన రాచరిక హోదాను కోల్పోయారు. రాజకుటుంబాన్ని విడిచిపెడుతున్నందుకు మాకోకు రావాల్సిన 140 మిలియన్ యెన్‌ (1.23 మిలియన్ డాలర్లు)లను మాకో తిరస్కరించారు. ఫలితంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చెల్లింపును వదులుకున్న రాజకుటుంబానికి చెందిన తొలి వ్యక్తిగా మాకో రికార్డులకు ఎక్కారు. జపాన్‌ చట్టం ప్రకారం మహిళలు తమ వివాహం తర్వాత సొంత ఇంటి పేరును తప్పనిసరిగా వదిలివేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో యువరాణి మాకో పేరు ఇకపై మాకోకొమురోగా మారిపోనుంది.

ఈ సందర్భంగా మాకో మాట్లాడుతూ.. తన వరకు చెప్పాలంటే కీ కొమ‌రో ఓ వెలకట్టలేని వ్యక్తి అని అభివర్ణించారు. తమ హృదయాలను మరింత దగ్గర చేసుకునేందుకు తమ వివాహం ఒక అవసరమైన ఎంపిక అని మాకో పేర్కొన్నారు. కొమురో మాట్లాడుతూ.. తనకు మాకో అంటే ఎంతో ఇష్టమని, ఈ జీవితాన్ని ఆమె ప్రేమలో గడిపేయాలని ఉందన్నారు. కష్టసుఖాల్లో భావాలను పంచుకోవడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి మాకోతో కలిసి ఉండాలని ఆశిస్తున్నట్టు చెప్పాడు.

జ‌పాన్ ప్ర‌స్తుత రాజు న‌రుహిటో సోద‌రుడు ప్రిన్స్ అఖిషినో కూతురే మాకో. 30 ఏండ్ల మాకో… టోక్యోలోని ఇంట‌ర్నేష‌న‌ల్ క్రిస్టియ‌న్ యూనివ‌ర్సిటీ నుంచి 2014లో క‌ళ‌లు, సాంస్కృతిక వార‌స‌త్వంలో బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ త‌ర్వాత లండ‌న్ వెళ్లి యూనివ‌ర్సిటీ ఆఫ్ లీసిస్ట‌ర్స్ నుంచి మ్యూజియాల‌జీలో మాస్ట‌ర్స్ ప‌ట్టా అందుకున్నారు. అయితే టోక్యోలోని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కొమురో ఆమెకు క్లాస్‌మేట్. అలా వారిద్దరికీ పరిచయం అయింది. తొలిచూపులోనే ఒక‌రికొక‌రు న‌చ్చేయ‌డంతో వారు ప్రేమించుకున్నారు. 2017లో త‌మ ప్రేమ విష‌యాన్ని మాకో అధికారికంగా ప్ర‌క‌టించారు. వచ్చే ఏడాది తాము వివాహం చేసుకుంటామని సెప్టెంబరు 2017లో మాకో ప్రకటించారు. అయితే మాకో కుటుంబంలో ఆర్థిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో ఆ పెళ్లి కాస్త 2020కు వాయిదా ప‌డి చివ‌ర‌కు ఇప్పుడు వివాహం పూర్త‌యింది. ఇకపై మాకో, కొమురో న్యూయార్క్‌లో సాధారణ ప్రజలలా జీవించాలని నిర్ణయించుకున్నారు.

ALSO READ Tollywood : రైతు ఖాతాలో రూ. లక్ష జమ చేసిన శేఖర్ కమ్ముల