Burger order : ఈ బుడ్డోడు మాములోడు కాదు.. ఏకంగా 31 చీజ్‌బర్గర్లు ఆర్డర్ చేసి.. చివరకు..

చిన్న పిల్లలు చేసే పనులు కోపాన్ని తెప్పించినా.. సరదాగా అనిపిస్తాయి. వారు చేసే చిలిపి చేష్టలతో ఎంతటి కోపమైనా మటుమాయం కావాల్సిందే. తాజాగా ఓ బుడ్డోడు తన తల్లి ఫోన్ నుంచి ఏకంగా 31 చీజ్ బర్గర్లకు ఆర్డర్ పెట్టాడు....

Burger order : ఈ బుడ్డోడు మాములోడు కాదు.. ఏకంగా 31 చీజ్‌బర్గర్లు ఆర్డర్ చేసి.. చివరకు..

Cheeseburgers

Burger order : చిన్న పిల్లలు చేసే పనులు కోపాన్ని తెప్పించినా.. సరదాగా అనిపిస్తాయి. వారు చేసే చిలిపి చేష్టలతో ఎంతటి కోపమైనా మటుమాయం కావాల్సిందే. తాజాగా ఓ బుడ్డోడు తన తల్లి ఫోన్ నుంచి ఏకంగా 31 చీజ్ బర్గర్లకు ఆర్డర్ పెట్టాడు.. కొద్దిసేపటి తరువాత తల్లి ఫోన్ తీసుకొని చూడగా బుడ్డోడు చేసిన ఘనకార్యాన్ని గుర్తించింది. యునైటెడ్ స్టేట్స్ టెక్సాస్ లో రెండేళ్ల బాలుడు తన తల్లి  కెల్సే బుర్క‌ల్ట‌ర్ గోల్డెన్‌ ఫోన్ నుండి డోర్‌డాష్ ఫుడ్ డెలివ‌రీ యాప్ ద్వారా మెక్‌డొనాల్డ్స్  నుండి రెండు డజన్లకుపైగా చీజ్‌ బర్గర్‌లను ఆర్డర్ చేశాడు. కొద్దిసేపటి తరువాత ఆ మహిళ ఫోన్‌ని పరిశీలించగా బుడ్డోడు చేసిన ఘనకార్యాన్ని గుర్తించింది.

Viral video: నడిరోడ్డుపై తన్నుకున్న లేడీ స్టూడెంట్స్.. వైరల్‌గా మారిన వీడియో

ఈ విషయంపై తల్లి మాట్లాడుతూ.. నా కొడుకు బారెట్ తనకు తెలియకుండానే ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ డోర్‌డాష్‌లో ఆర్డర్ చేసాడు. నా కొడుకు నా ఫోన్‌తో ఆడుకోవటం, ఫొటోలు తీస్తుండటం చేస్తాడని నేను అనుకున్నానని ఆమె తెలిపింది. కానీ ఫుడ్ డెలివరీ బాయ్ నుంచి మీ ఆర్డర్ పెద్దదిగా ఉందని కాస్త టైం పడుతుందని మెస్సేజ్ రావడంతో.. ఫోన్ తీసుకొని చూడగా బారెట్ తన ఫోన్ తో ఆడుతున్న సమయంలో ఆర్డర్ చేసినట్లు గుర్తించానని తెలిపింది. కాగా ఆర్డర్ వచ్చిన తరువాత వాటి బారెట్ పక్కన ఉంచి ఫొటో తీసిన కెల్సీ గోల్డెన్.. తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

Viral video: నిద్రించే పరుపుకోసం యాజమానితో ఏనుగు పిల్ల గొడవ.. పట్టుపట్టి సాధించుకుంది..

ఈ విధంగా కామెంట్ చేసింది. ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే నేను మెక్‌డొనాల్డ్స్ నుండి 31 ఉచిత చీజ్‌బర్గర్‌లను కలిగి ఉన్నాను. నా రెండేళ్ల కుమారుడికి డోర్‌డాష్ ఫుడ్ డెలివ‌రీ యాప్ ద్వారా ఎలా ఆర్డర్ చేయాలో తెలుసు అంటూ ఆమె పేర్కొంది. 31 బ‌ర్గ‌ర్ల‌ను ఏం చేయాలో తెలియ‌క ఆ త‌ల్లి వాటిని కొంద‌రికి డొనేట్ చేసింది. ఇకనుంచి ఇలాంటి దుర్వినియోగానికి తన రెండేళ్ల కుమారుడు పాల్పడకుండా ఉండటానికి నేను నా ఫోన్ ను దాచిపెడతానంటూ పేర్కొంది. లేకుంటే కనీసం డోర్‌డాష్ యాప్‌ను వాడ‌కుండా ఉండేందుకు దాన్ని హైడ్ చేయ‌నున్న‌ట్లు ఆమె తెలిపింది.