ట్రెండీ దొంగ : డాగ్ ఫుడ్ ను దొంగిలించిన తాబేలు 

  • Published By: veegamteam ,Published On : May 9, 2019 / 10:20 AM IST
ట్రెండీ దొంగ  : డాగ్ ఫుడ్ ను దొంగిలించిన తాబేలు 

తాబేలు అంటే చిట్టి పొట్టి అడుగులు వేసుకుంటా బుజ్జిబుజ్జిగా నడుస్తుంది. మెల్లగా నడిచేవారిని తాబేలులాగే ఏంటా నడక అంటారు. తాబేలు నడక అంటే గుర్తుకొచ్చింది. కుందేలు-తాబేలు పరుగుపందెం పంచ తంత్రం కథ గుర్తుకొస్తుంది. ఆ పోటీలో గెంతులేసే కుందేలును ఓడించి తాబేలే విజేతగా నిలుస్తుంది. ఈ కథ అలా ఉంటే..మనం ఓ దొంగ తాబేలుగారి  గురించి చెప్పుకుందాం..ఇది కథ మాత్రం కాదు..అక్షరాలు నిజం. నిమిషానికి నాలుగు అడుగులు కూడా నడవలేని తాబేలు దొంగతనం చేయటమేంటి ఆశ్చర్యంగా ఉంది కదూ..అదే మరి చిత్రం. తాబేలు ఆకారం చిత్రం అంటే అది చేసిన చిలిపి దొంగతనం మరీ విచిత్రంగా ఉంది.  మరి అది చేసిన చిలిపి పని ఎలా వైరల్ గా మారిందో చూద్దాం..

తాబేలు సహజంగా శాఖాహారి. ఆకులు..దుంపలు వంటివి తింటుంది. కానీ ఎప్పుడు ఒకే రకం ఫుడ్ తింటే బోర్ కొడుతుంది కదూ. తాబేలుకి కూడా ఆకులు..పచ్చిగడ్డి తిని బోర్ కొట్టిందో ఏమో..పైగా మాంచి ఆకలిమీదుంది. దీంతో ఓ సూపర్ మార్కెట్ లోకి చొరబడింది. అలా దానికో కుక్కలకు పెట్టే ఫుడ్ ప్యాకెట్ దొరికింది. చక్కగా లాగించేసింది. 

సూపర్ మార్కెట్లలోకి కస్టమర్స్ వచ్చి సరుకులు కొనుక్కుని వెళ్లటం మామూలే. కానీ ఓ తాబేలు సూపర్ మార్కెట్ కు రావటం మీరు చూశారా? కనీసం ఊహించారా? కానీ మీకే అటువంటి సందర్భం ఎదురైతే ఎలా ఉంటుంది? సరిగ్గా ఓ వ్యక్తికి అదే ఫీలింగ్ కలిగింది. సూపర్ మార్కెట్ కు వెళ్లిన అతనికి అక్కడ ఓ తాబేలు కనిపించింది. ఎటు నుంచీ ఎలా వచ్చిదో గానీ..బాగా ఆకలేసిందేమో…కుక్కలకు వేసే ఫుడ్ ప్యాకెట్ కు కన్నం పెట్టి… డాగ్ ఫూడ్‌ని ఫుల్ గా  లాగించేసింది. ఇది చూసి ఆశ్చర్యపోయిన ఆ కస్టమర్ ఓ చిన్న వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అంతే… ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఈ  వీడియోని ఇప్పటివరకూ 1.88 లక్షల మంది లైక్ చేశారు. 48 వేలకు పైగా రీట్వీట్స్ వచ్చాయి. ఇక 12వేలకు పైగా కామెంట్లతో షేరవుతోంది ఆ వీడియో కూర్మరాజుగారి వీడియో..అదేనండి తాబేలుగారి వీడియో.