ట్రంప్ ట్విట్టర్ ఖాతా శాశ్వతంగా తొలగింపు

ట్రంప్ ట్విట్టర్ ఖాతా శాశ్వతంగా తొలగింపు

Trump, Permanently Banned From Twitter : ఇక కొద్ది రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి తొలగిపోనున్న డోనాల్డ్ ట్రంప్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. అంతేగాకుండా..టీమ్ ట్రంప్ పేరిట ఉన్న ఖాతాను కూడా సస్పెండ్ చేసింది. ఇటీవలే..సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ లు ట్రంప్ అకౌంట్లను 12 గంటల పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్లాట్ ఫాంలపై నిబంధనలు ఉల్లంఘించినందుకు తొలగించాయి. తాజాగా..ఆయనతో పాటు..టీం చేస్తున్న ట్వీట్లను నిశితంగా పరిశీలించింది. ‘హింస’ను మరింత ప్రేరేపించే ప్రమాదం ఉన్నందున అకౌంట్ ను శాశ్వతంగా నిలిపివేసినట్లు బ్లాగ్ పోస్టులో ట్విట్టర్ వెల్లడించింది.

గత నవంబర్ నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలుపొందిన సంగతి తెలిసిందే. కానీ ఆయన గెలుపును ట్రంప్ ఒప్పుకోలేదు. దీనికి సంబంధించిన వాటిని ట్విట్టర్ వేదికగా..ట్వీట్స్ చేశారు. ఇటీవలే యూఎస్ కాంగ్రెస్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఇందులో…జో బోడైన్ ఎన్నికలను ధృవీకరించేందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. కానీ..ఈ సమావేశాన్ని అడ్డుకొనేందుకు ట్రంప్ మద్దతు దారులు యూఎస్ క్యాపిటల్ భవన్ లోకి చొచ్చుకరావడంతో హింసాత్మక వాతావరణం ఏర్పడింది.

బైడెన్ ఎన్నిక సమావేశం జరుగుతుండగానే..తన మద్దతుదారుల నుంచి ట్రంప్ మరింత రెచ్చగెట్టేలా వ్యవహరించారు. నేషనల్ మాల్ లో మాట్లాడిన తర్వాత.. భవనంలో జరిగిన దాడికి సంబంధించిన వీడియోను ఒక ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశారు. ఐ లవ్ యూ అభిమానులను రెచ్చగొట్టేలా ఉందని ఫేస్ బుక్, ట్విట్టర్ యాజమాన్యాలు ధృవీకరించాయి. ఈ వీడియోను ఆ సంస్థలు తొలగించాయి. ట్విట్టర్ 12 గంటల పాటు ట్రంప్ అకౌంట్ ను లాక్ చేసింది. పోస్టర్లను వెంటనే తొలగించాలని సూచించింది. ట్రంప్ మద్దతుదారులు జరిపిన తిరుగుబాటుతో తాము బాధ పడుతున్నట్లు ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సేకు వందల మంది ఉద్యోగులు లేఖలు రాసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలోనే..ట్విట్టర్ కఠిన నిర్ణయం తీసుకుంది.