Donald Trump: నేనైతే ఒక్క రోజులోనే తేలిపోయేది.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్

మరొక పోస్ట్‌లో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్‌పై ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉక్రెయిన్‌కు ట్యాంకులను అందించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అలా చేసి యుద్ధాన్ని మరింత తీవ్ర చేయవద్దని కోరారు. ప్రస్తుత పరిస్థితిలో యుద్ధ ట్యాంకులు ఇవ్వడం వల్ల తదుపరి దశలో అది అణు యుద్ధానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. “ముందు ట్యాంకులు వస్తాయి, తర్వాత అణుబాంబులు వస్తాయి

Donald Trump: నేనైతే ఒక్క రోజులోనే తేలిపోయేది.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్

Trump says he could end Russia-Ukraine war 'within 24 hours'

Donald Trump: ఏడాది కాలంగా ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానే కనుక అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే, కేవలం 24 గంటల్లోనే ఆ యుద్ధాన్ని ఆపేసి ఉండేవాడినని అన్నారు. మానవ జీవితంలో ఇది చాలా విషాదకరమైన సందర్భమని ఆయన అన్నారు. రష్యా భీకర దాడికి దిగబోతోందన్న వార్తల నేపథ్యంలో ఉక్రెయిన్‭కు అధునాతన ఆయుధాలు అందిస్తామని అమెరికా, జర్మనీ దేశాలు హామీ ఇవ్వడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల ఇప్పటికే ఉన్న యుద్ధాన్ని అణ్వాయుధాలవైపుకు మళ్లించడమవుతుందని అన్నారు. తన సోషల్ మీడియా వేదిక అయిన ‘ఆల్-క్యాప్స్’ ద్వారా ఈ విషయమై తన అభిప్రాయాలను పంచుకున్నారు ట్రంప్.

Gautam Adani : భారీగా పడిపోయిన అదానీ గ్రూప్ షేర్లు.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఏడో స్థానంకు అదానీ..

‘‘అర్థవంతమైన నైపుణ్యమైన చర్చల ద్వారా వివాదాన్ని సులభంగా ముగించవచ్చు. నేను అధ్యక్షుడిగా ఉన్నట్లయితే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదు. ఒకవేళ ఈ సమయంలోనే నేను అధ్యక్షుడిగా ఉన్నా కూడా, ఈ భయంకరమైన, విపరీతమైన దుష్ప్రవర్తనను 24 గంటల్లో ముగించేవాడిని.మానవ జీవితంలో ఇంత విషాదకరమైన సందర్భం” అని రాశారు.

Bharat Jodo Yatra: మేము బిచ్చగాళ్లం కాదు..! భారత్ జోడోయాత్రలో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఓమర్ అబ్దుల్లా ..

మరొక పోస్ట్‌లో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్‌పై ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉక్రెయిన్‌కు ట్యాంకులను అందించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అలా చేసి యుద్ధాన్ని మరింత తీవ్ర చేయవద్దని కోరారు. ప్రస్తుత పరిస్థితిలో యుద్ధ ట్యాంకులు ఇవ్వడం వల్ల తదుపరి దశలో అది అణు యుద్ధానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. “ముందు ట్యాంకులు వస్తాయి, తర్వాత అణుబాంబులు వస్తాయి. ఈ వెర్రి యుద్ధాన్ని ఇప్పుడే ముగించండి. యుద్ధాన్ని ముగించడం కూడా చాలా సులువు” అని ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు దాదాపు మూడు డజన్ల ఎం1 అబ్రమ్స్ ప్రధాన యుద్ధ ట్యాంకులను సరఫరా చేయడానికి నాలుగు రోజుల క్రితం అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.