Bharat Jodo Yatra: మేము బిచ్చగాళ్లం కాదు..! భారత్ జోడోయాత్రలో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఓమర్ అబ్దుల్లా ..

జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ .. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ‌వాళ్లు పిరికి పందలని అన్నారు. 2014 తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రపై ప్రశంసల వర్షం కురిపించారు.

Bharat Jodo Yatra: మేము బిచ్చగాళ్లం కాదు..! భారత్ జోడోయాత్రలో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఓమర్ అబ్దుల్లా ..

Bharat jodo yatra

Bharat Jodo Yatra: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న యాత్ర ఈనెల 30న ముగియనుంది. జమ్మూలో ఎముకలు కొరికే చలిలోనూ రాహుల్ వైట్ టీషర్ట్ పైనే పాదయాత్రలో పాల్గొన్నారు. తలకు బ్లాక్ క్యాప్ ధరించారు.  గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాహుల్ యాత్రకు విరామం ఇచ్చారు. తిరిగి శుక్రవారం యాత్ర పున: ప్రారంభమైంది.

Bharat Jodo Yatra: కశ్మీర్‌లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర.. రాహుల్‌తో కలిసి పాల్గొన్న ఒమర్ అబ్దుల్లా

జమ్మూ డివిజన్‌లోని బనిహాల్ నుంచి శుక్రవారం ఉదయం భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. రామ్‌బన్ జిల్లాలోని బనీహల్‌ వద్ద యాత్రలో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి దాదాపు రెండు కిలో మీటర్లు నడిచారు. వీరితో పాటు రెండు పార్టీల నేతలు, వందలాది కార్యకర్తలు యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ .. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ‌వాళ్లు పిరికి పందలని అన్నారు. 2014 తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదని, మిలిటెన్సీ తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఇలా జరగలేదని అబ్దుల్లా తెలిపారు. జమ్మూకశ్మీర్ ప్రజలు ఎన్నికలకోసం అడుక్కోవాలని ప్రభుత్వం కోరుకుంటోందని, మేము బిచ్చగాళ్ళం కాదు, మేము దానికోసం అడుక్కోము అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bharat Jodo Yatra: రాహుల్‌తో బాలీవుడ్ నటి .. జమ్మూలో భారీ భద్రత నడుమ భారత్ జోడో యాత్ర ..

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ వైఖరి గురించి తాను తెలుసుకోవాలని భావించడం లేదని చెప్పారు. ఆర్టికల్ 370 పునరుద్దరణ కోసం మేం కోర్టులో కేసుద్వారా పోరాడుతున్నామని తెలిపారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రపై ఒమర్ అబ్దుల్లా ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ జోడో యాత్ర రాహుల్ ఇమేజ్ పెంచేందుకు ఉద్దేశించినది కాదని, దేశంలో పరిస్థితులను మెరుగుపర్చేందుకు చేపట్టిన యాత్ర అని అన్నారు. దేశ ప్రతిష్ట కోసమే రాహుల్ పాదయాత్రలో పాల్గొని మద్దతు ప్రకటించడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో ముస్లిం ప్రతినిధి ఎవరూలేరని, అయితే, అరబ్ దేశాలతో స్నేహబంధం కోసం భారత్ ప్రయత్నిస్తుందని విమర్శించారు.