BlueTick: మస్క్ మామూలోడు కాదు.. ఏకంగా ట్విట్టర్ స్థాపించినోడి బ్లూటిక్ కూడా తొలగించాడు

మస్క్ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ బ్లూటిక్ (Twitter BlueTick)ను చాలా మంది కోల్పోయారు. చాలా మంది రాజకీయ నాయకులు, సినీనటులు, క్రీడాకారులు ట్విట్టర్ చర్యతో షాక్ అయ్యారు. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉండే ప్రముఖులు.. ట్విట్టర్ ఇలా చేస్తుందని ఊహించలేదు.

BlueTick: మస్క్ మామూలోడు కాదు.. ఏకంగా ట్విట్టర్ స్థాపించినోడి బ్లూటిక్ కూడా తొలగించాడు

Jack and Musk

BlueTick: లెగసీ బ్లూటిక్‭లను తొలగిస్తామని చెప్పిన ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్.. అన్నంత పనీ చేశారు. గురువారం రాత్రి ట్విట్టర్ ఓపెన్ చేసే సరికి మామూలు వ్యక్తుల నుంచి మహామహుల వరకు పేరుకు పక్కన ఉన్న బ్లూటిక్ ఎగిరిపోయింది. షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రాహుల్ గాంధీ, క్రిస్టియానో రొనాల్డో, బీజేపీ, కాంగ్రెస్, మాయావతి, బీటీఎస్ లాంటి ఎంతో మంది ఖాతాల బ్లూటిక్ పోయాయి. ఇంకో విచిత్రం ఏంటంటే.. ట్విట్టర్ సహ-వ్యవస్థాపకుడు అయిన జాక్ డోర్సే బ్లూటిక్ సైతం పోయింది. కొంత కాలం క్రితం వరకు ట్విట్టర్ సీఈవోగా కొనసాగారు జాక్ డోర్సే. అనంతరం ఆయన స్థానంలో భారత సంతతి వ్యక్తి అయిన పరాగ్ అగర్వాల్ సీఈవోగా వచ్చారు. పరాగ్ వచ్చిన కొద్ది రోజులకే ట్విట్టర్ అమ్మకం జరిగింది.

AP CM Jagan : ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలి : సీఎం జగన్

ఇక బ్లూటిక్ తొలగింపు ఒక రోజు ముందే తన కొత్త మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‭ను జాక్ డోర్సే ప్రారంభించారు. ట్విట్టర్ నుంచి వైదొలగిని కొంత కాలానికే కొత్త మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ తీసుకురానున్నట్లు ప్రకటించిన ఆయన.. ‘బ్లూస్కై’ అనే పేరుతో ఎట్టకేలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీన్ని ప్రధానంగా ట్విట్టర్‭కు పోటీగా తీసుకువచ్చినట్లు కూడా విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి దీన్ని ఫిబ్రవరిలోనే అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ.. కేవలం iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంచారు. అయితే అది కూడా బేటా వెర్షన్ చెకప్ కోసమేనని అప్పట్లో డోర్సే వెల్లడించారు.

Elon Musk : ఈ సెలబ్రిటీలు వద్దన్నా ఫ్రీగా ట్విట్టర్ బ్లూ టిక్ ఇచ్చాడు.. అకౌంట్ మీది.. పేమెంట్ నాది అంటున్న మస్క్..!

ఇక మస్క్ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ బ్లూటిక్ (Twitter BlueTick)ను చాలా మంది కోల్పోయారు. చాలా మంది రాజకీయ నాయకులు, సినీనటులు, క్రీడాకారులు ట్విట్టర్ చర్యతో షాక్ అయ్యారు. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉండే ప్రముఖులు.. ట్విట్టర్ ఇలా చేస్తుందని ఊహించలేదు. దీంతో ట్విట్టర్ పై సెటైర్లు, మీమ్స్ ఉప్పెనలా పొంగుతున్నాయి. “బ్లూటిక్ కావాలంటే.. బ్లాటిక్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి” అని ఎలాన్ మస్క్ చెబుతున్నట్లు కొందరు మీమ్స్ సృష్టించారు. ట్విట్టర్ తీసుకున్న చర్య అత్యద్భుతం అంటూ కొందరు సెటైర్లు వేశారు.

Satisfied After A Meal : భోజనం తర్వాత మానసికంగా మరింత సంతృప్తి చెందాలంటే ?

ఇంతకు ముందు బ్లూటిక్ ఉంటే చాలా గొప్పగా భావించే వారని, ఇప్పుడు అటువంటి వారు తమకు బ్లూటిక్ పోవడంతో.. బ్లూటిక్ ఉన్న ఇతరులను గొప్పవారుగా భావించాలని కొందరు కామెంట్లు చేశారు. మరోవైపు, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) తన కంపెనీ చర్యను తనదైన శైలిలో సమర్థిస్తూ ట్వీట్ చేశారు. “చాలా రకాలుగా చాలా గొప్ప రోజు” అంటూ ట్వీట్ చేశారు. చివరకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతానూ ఎలాన్ మస్క్ వదలలేదని కొందరు ట్వీట్లు చేశారు. బ్లూటిక్ ఉండాలంటే డబ్బులు ఉండాలని కొందరు సెటైర్లు వేశారు. ఎలాన్ మస్క్ అన్నంత పనీ చేశారని కొందరు మీమ్స్ సృష్టించారు. బ్లూటిక్ పోగానే ఏం చేయాలో తెలియట్లేదంటూ కొందరు ట్వీట్లు చేశారు.