Elon Musk : ఈ సెలబ్రిటీలు వద్దన్నా ఫ్రీగా ట్విట్టర్ బ్లూ టిక్ ఇచ్చాడు.. అకౌంట్ మీది.. పేమెంట్ నాది అంటున్న మస్క్..!

Elon Musk : ట్విట్టర్ లెగసీ వెరిఫైడ్ అకౌంట్లలో బ్లూ టిక్ అదృశ్యమైంది. అన్ని లెగసీ అకౌంట్లలో దాదాపు బ్లూ టిక్ తొలగించాడు మస్క్. కానీ, కొంతమంది సెలబ్రిటీలకు మాత్రం బ్లూ టిక్ అలానే ఉంచాడు. వారు మాకొద్దు బాబోయ్ అంటున్నా తానే పేమెంట్ చేస్తానని మస్క్ మాట ఇచ్చాడు.

Elon Musk : ఈ సెలబ్రిటీలు వద్దన్నా ఫ్రీగా ట్విట్టర్ బ్లూ టిక్ ఇచ్చాడు.. అకౌంట్ మీది.. పేమెంట్ నాది అంటున్న మస్క్..!

Twitter removes Blue Verified Badge of non-paying

Elon Musk : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) ఏప్రిల్ 20 నుంచి అన్ని లెగసీ ట్విట్టర్ అకౌంట్లలో బ్లూ టిక్ తొలగించింది. దాదాపు అందరి సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల అకౌంట్లలోనూ బ్లూ టిక్ తొలగించాడు ఎలన్ మస్క్. బ్లూ టిక్ కావాలంటే.. సబ్ స్ర్కిప్షన్ తీసుకోవాల్సిందేనని తెగేసి చెప్పాడు. ఎవరైతే గడువు తేదీలోగా బ్లూ టిక్ సబ్ స్ర్కిప్షన్ కోసం చెల్లించలేదో ఆయా అకౌంట్లలో బ్లూ టిక్ అదృశ్యమైంది. ఏప్రిల్ 1వ తేదీనే మస్క్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.

ట్విట్టర్ బ్లూ టిక్ కోరుకునే ప్రతి యూజర్ తప్పనిసరిగా బ్లూ టిక్ పేమెంట్ సబ్ స్ర్కిప్షన్ తీసుకోవాల్సిందిగా నిర్ణయించాడు. అన్నట్టుగానే మస్క్ చేసి చూపించాడు. గడువు తేదీలోగా ఎవరైతే బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ కోసం చెల్లించలేదో ఆయా అకౌంట్లలో వెరిఫైడ్ బ్యాడ్జ్ కంపెనీ సీఈఓ ఎలోన్ మస్క్ తొలగించాడు. ఏప్రిల్ 20 నుంచి వివిధ డొమైన్‌లలో చాలా మంది ప్రముఖులు, సెలబ్రిటీలు తమ అకౌంట్లలో వెరిఫైడ్ చెక్ మార్క్‌ను కోల్పోయారు. ట్విట్టర్ బ్లూ టిక్ కోసం చెల్లించినవారికి మాత్రమే కొన్ని సరికొత్త ఫీచర్లను పొందవచ్చు. వారి పేర్ల ముందు బ్లూ టిక్ చెక్‌మార్క్‌ను కలిగి ఉంటారు.

Read Also : Twitter Blue Verified Badge : లెగసీ బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను తొలగించిన ట్విట్టర్.. ఎవరినీ వదల్లేదు.. ఎలన్ మస్క్ అన్నట్టే చేశాడుగా..!

కొంతమంది సెలబ్రిటీలు మస్క్ బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ పేమెంట్ సర్వీసు తీవ్రంగా వ్యతిరేకించారు. అందులో బాస్కెట్‌బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్, రచయిత స్టీఫెన్ కింగ్ బ్లూ టిక్ సర్వీసు కోసం సైన్ అప్ చేయబోమని బహిరంగంగా ప్రకటించారు. కానీ, ఇప్పటికీ వారి అకౌంట్లో బ్లూ టిక్ చెక్‌మార్క్‌లు అలాగే ఉన్నాయి. అందరి లెగసీ బ్లూ టిక్ తొలగించిన మస్క్ తమ అకౌంట్లలో మాత్రం బ్లూ టిక్ అలానే ఉంచడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాము బ్లూ టిక్ కోసం ఎలాంటి పేమెంట్ చేయలేదని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన మస్క్.. వారి అకౌంట్లలో బ్లూ టిక్ కోసం తానే వ్యక్తిగతంగా చెల్లిస్తున్నానని స్పష్టం చేశారు.

కొన్ని అకౌంట్లకు నేనే వ్యక్తిగతంగా చెల్లిస్తున్నా.. మస్క్ క్లారిటీ :
అమెరికన్ రచయిత స్టీఫెన్ కింగ్ ట్విట్టర్ వేదికగా.. ‘నా ట్విట్టర్ అకౌంట్.. బ్లూకు సబ్‌స్క్రైబ్ అయ్యానని చెబుతోంది. నేను అయితే చేయలేదు. నా ట్విట్టర్ అకౌంట్లో నా ఫోన్ నంబర్ మాత్రమే ఇచ్చాను. అని ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ట్వీట్‌కు మస్క్ రిప్లై ఇస్తూ.. ‘మీకు స్వాగతం నమస్తే’ అంటూ ఒక ఎమోజీని పోస్టు చేశాడు.

‘లెగసీ అకౌంట్లో కొన్నింటికి బ్లూ టిక్ కోసం నేను వ్యక్తిగతంగా చెల్లిస్తున్నాను’ అంటూ మస్క్ మరో ట్వీట్ చేశాడు. గతంలో బ్లూ కలర్ చెక్‌మార్క్‌ కోసం చెల్లించేది లేదని గత నెలలో స్టార్ ట్రెక్ స్టార్ విలియం షాట్నర్‌, లెబ్రాన్ కింగ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Elon Musk : Twitter removes Blue Verified Badge of non-paying

Elon Musk : Twitter removes Blue Verified Badge of non-paying

బ్లూ టిక్ కోల్పోయిన సెలబ్రిటీలు వీరే.. :
మరికొందరు ప్రముఖుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ తమ ట్విట్టర్ వెరిఫైడ్ బ్యాడ్జీలను కోల్పోయిన వారిలో ఉన్నారు. అలాగే, బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అలియా భట్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి అనేక మంది భారతీయ ప్రముఖులు, క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా తమ ట్విట్టర్ అకౌంట్లలో వెరిఫైడ్ బ్లూ టిక్‌లను కోల్పోయారు.

సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, కంపెనీలు, బ్రాండ్‌లు, వార్తా సంస్థలు, ఇతర ‘ప్రజా ప్రయోజనాల‘ అకౌంట్లు నిజమైనవని, మోసగాళ్ళు లేదా పేరడీ అకౌంట్లు కాదని వినియోగదారులు గుర్తించడంలో సాయపడటానికి కంపెనీ 2009లో బ్లూ చెక్ మార్క్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం కోసం కంపెనీ గతంలో ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదు.

కానీ, బిలియనీర్ మస్క్ ట్విట్టర్ టేకోవర్ చేసిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. అందులో భాగంగానే ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ కోసం డబ్బులు చెల్లించాల్సిందేనంటూ కొత్త రూల్ తీసుకొచ్చాడు. మస్క్ నిర్ణయంపై ట్విట్టర్ యూజర్లు తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్ బ్లూ టిక్ కోసం ఎలాంటి చెల్లింపులు చేసేది లేదని సెలబ్రిటీలు సైతం స్పష్టం చేశారు.

Read Also : Twitter Blue Verified Badge : లెగసీ బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను తొలగించిన ట్విట్టర్.. ఎవరినీ వదల్లేదు.. ఎలన్ మస్క్ అన్నట్టే చేశాడుగా..!