Thousands of Flight Canceled : యూఎస్‌లో భారీ తుపాన్…వేలాది విమాన సర్వీసుల రద్దు

యునైటెడ్ స్టేట్స్ లో భారీ తుపాన్ ప్రభావం వల్ల వేలాది విమాన సర్వీసులు రద్ధు చేశారు. వాషింగ్టన్‌లోని మాన్యుమెంట్ మీదుగా తుపాను మేఘాలు అలముకున్నాయి. తుపాన్ ప్రభావం వల్ల సుడిగాలులు, వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తున్నాయి....

Thousands of Flight Canceled : యూఎస్‌లో భారీ తుపాన్…వేలాది విమాన సర్వీసుల రద్దు

US flight canceled

Thousands of Flight Canceled : యునైటెడ్ స్టేట్స్ లో భారీ తుపాన్ ప్రభావం వల్ల వేలాది విమాన సర్వీసులు రద్ధు చేశారు. వాషింగ్టన్‌లోని మాన్యుమెంట్ మీదుగా తుపాను మేఘాలు అలముకున్నాయి. తుపాన్ ప్రభావం వల్ల సుడిగాలులు, వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తున్నాయి. (Thousands of Flight Cancellations) తుపాన్ ప్రభావంతో వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను సోమవారం ఇంటికి పంపారు. వడగళ్ల వర్షంతో పాటు భారీ గాలులు, సుడిగాలులు వీస్తుండటంతో గ్రేటర్ డీసీ ప్రాంతంలో నేషనల్ వెదర్ సర్వీస్ టోర్నడో హెచ్చరిక జారీ చేసింది. (strong storms hit eastern us) ఈ తుపాన్ ప్రభావం వల్ల యూఎస్ లో ఇద్దరు మరణించారు.

Zelensky : జెలెన్స్కీ హత్యకు రష్యా కుట్ర…యుక్రెయిన్ మహిళ గూఢచర్యం

టేనస్సీ నుంచి న్యూయార్క్ వరకు 10 రాష్ట్రాల్లో సుడిగాలులు వీస్తున్నాయని హెచ్చరించింది. ఈ హరికేన్ల ప్రభావంతో 29.5 మిలియన్లకు పైగా ప్రజలు అల్లాడుతున్నారు. సౌత్ కరోలినాలోని అండర్సన్ లో తుపాన్ సమయంలో కారులో నుంచి దిగిన 15 ఏళ్ల బాలుడిపై చెట్టు మీద పడింది. దీంతో అతను మరణించాడని అండర్సన్ కౌంటీ ఆఫీస్ తెలిపింది. అలబామాలోని ఫ్లోరెన్స్ లో 28 ఏళ్ల వ్యక్తి పిడుగుపాటుకు గురై మరణించాడు.

Akasa Air : Akasa Air : ఆకాశ ఎయిర్ ప్రతీ వారం 900 విమాన సర్వీసులు

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తుపాన్ ప్రభావంతో విమానాలను దారి మళ్లించారు. ఫిలడెల్ఫియాలోని ఫిల్లీస్, వాషింగ్టన్ నేషనల్స్ మధ్య జరిగే మేజర్ లీగ్ బేస్‌బాల్ గేమ్ తుపానుల కారణంగా వాయిదా పడింది. మేరీల్యాండ్ లో 10.2 సెంటీమీటర్ల వర్షం కురవడంతో మెరుపు వరద హెచ్చరికను నేషనల్ వెదర్ సర్వీస్ మంగళవారం జారీ చేసింది.

Eris : కరోనా డేంజర్ బెల్స్.. శరవేగంగా వ్యాపిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్, లక్షణాలు ఇవే.. ఆసియా దేశాలకు పొంచి ఉన్న ముప్పు

అలబామా, జార్జియా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, మేరీల్యాండ్, డెలావేర్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, టేనస్సీ, వెస్ట్ వర్జీనియా, వర్జీనియాలో 1.1 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పలు రాష్ట్రాల్లో చెట్లు, విద్యుత్ లైన్లు నేలకూలాయి. రోడ్లు, కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి.

Patancheru Mokila : ఒక్క గజం ధర లక్ష రూపాయలు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన మోకిలా ప్లాట్లు

తుపాన్ ప్రభావం వల్ల సోమవారం రాత్రి నాటికి 2,600 విమానాలను రద్దు చేశామని ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్ అవేర్ తెలిపింది. హార్ట్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. దేశంలో 7,900 విమానాల రాకపోకల్లో జాప్యం జరిగింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తూర్పు తీరానికి వెళ్లే తుపాన్ల వల్ల పలు విమానాలను దారి మళ్లించారు. డెలావేర్‌లోని హాకెస్సిన్‌లో ఒక నివాసం పైకప్పు కూలిపోయింది.