Daisy-May Demetre : కాళ్లు లేని చిన్నారి క్యాట్ వాక్..ఆత్మవిశ్వాసం ముందు తలవంచిన అంగవైకల్యం

కాళ్లు లేకపోయినా అంతులేని ఆత్మవిశ్వాసం ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని నిరూపించింది 10 ఏళ్ల చిన్నారి. పారిస్ మహానగరంలో ఓ ప్రముఖ ఫ్యాషన్ షోలో కాళ్లు లేని ఆ చిన్నారి చేసే క్యాట్ వాక్ మీదనే ఉన్నాయి. ఆత్మవిశ్వాసం అంటే ఈ చిన్నారిలాగే ఉంటుందా? అని ఆశ్చర్యపోతారు ఆమె క్యాట్ వాక్ చూసినవారంతా. ఆ చిన్నారి పేరు ‘డైసీ మే‘. ఇప్పటికే ఎన్నో ఫ్యాషన్ లలో క్యాట్ వాక్ చేసి ఔరా అనిపించుకుంది.

Daisy-May Demetre : కాళ్లు లేని చిన్నారి క్యాట్ వాక్..ఆత్మవిశ్వాసం ముందు తలవంచిన అంగవైకల్యం

10years Daisy May Demetre (1)

Daisy-May Demetre catwalk model : కాళ్లు లేకపోయినా అంతులేని ఆత్మవిశ్వాసం ఉంటే చాలు అందలాలు ఎక్కవచ్చని ఎంతోమంది నిరూపించారు. పారిస్ అంటేనే ఫ్యాషన్ కు పుట్టిల్లు అంటారు. అటువంటి పారిస్ మహానగరంలో ఓ ప్రముఖ ఫ్యాషన్ షోలో అందరి కళ్లూ ఓ చిన్నారిమీదనే ఉన్నాయి. కాదు కాదు అందరి కళ్లనుతనవైపు తిప్పుకుందా 10 ఏళ్ల చిన్నారి. రెండు కాళ్లు లేకపోయినా ఆమె ర్యాంప్ మీదకు ఎక్కిదంటే చాలు ప్రముఖుల అందరి కళ్లూ ఆమె చేసే క్యాట్ వాక్ మీదనే నిలిచిపోతాయి. ఆత్మవిశ్వాసం అంటే ఇదిగో ఈ చిన్నారిలాగే ఉంటుందా? అని ఆశ్చర్యపోతారు ఆమె క్యాట్ వాక్ చూసినవారంతా. ఆ చిన్నారి పేరు ‘డైసీ మే‘. ఇప్పటికే ఎన్నో ఫ్యాషన్ లలో క్యాట్ వాక్ చేసింది.

18 నెలల వయస్సప్పుడే రెండు కాళ్లూ కోల్పోయినా..ఊహ తెలిసాక తోటి పిల్లలంతా లేడి పిల్లల్లా గెంతుతూ ఆడుకుంటుంటే అరె నాకు కాళ్లు లేవే..వారిలా ఆడుకోవటానికి అని బాధపడేది. కానీ రాను రాను ఆమెలో ఏదో సాధించాలని అనుకునేది. కానీ అదేమిటో ఆ చిట్టి మనస్సుకు తెలీదు. కానీ ఏమో.. ఏంటో చేయాలని మనస్సులో బలంగా ముద్ర పడిపోయింది. అదే ఆమెను ఓ బ్రాండ్ అంబాసిడర్ ని చేసింది. ఆ లక్ష్యమే ఆమెను ప్రముఖులు జడ్జీలుగా పాల్గొనే ర్యాంప్ మీద క్యాట్ వాక్ చేసేలా చేసింది. అందాల పోటీలంటే అందగత్తె అనిపించుకోవటం కాదు. మనస్సు..ఆలోచనలు…అన్నీ అందంగా ఉండాలి. అందం అంటే శరీర కొలతలు కాదు. అందమంటే ఆత్మవిశ్వాసంతో విజయాలు అందుకోవటం. మనలో ఉన్న శారీరక..మానసిక లోపాలను అధిగమించి విజయకేతనం ఎగువేయటం అని నిరూపించింది కాళ్లులేని ఓ బాలిక. ఆ చిన్నారి పేరు డైసీ మే. వయస్సు 10ఏళ్లు.

పసిచాయలు కూడా వీడని ఈ చిన్నారి ప్రపంచం అంతా తనవైపు చూసేలా చేసుకుంది. తొమ్మిది సంవత్సరాల డైసీ మోడల్ గా తనకంటూ ఓ ప్రత్యేక ఏర్పరచుకుంది. మోడల్ అంటే ర్యాంప్ పై కాళ్లతో ‘క్యాట్ వాక్’ చేయటమేకాదు..కాళ్లు లేకపోయినా ‘క్యాట్ వాక్’ చేయవచ్చని నిరూపించింది. ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ప్యారిస్ లో ఫ్యాషన్ షోలో మెరిసింది.కాళ్లు లేకుంటేనేం నాలో ఏం తక్కువ అంటూ సత్తాను చాటింది. నేటికీ చాటుతోంది. 9 ఏళ్ల వయస్సులో ‘ప్యారిస్ ఫ్యాషన్ వీక్ -2019లో పాల్గొన్న డైసీని ఫ్యాషన్ ప్రియులు అంతా కళ్లార్పకుండా చూశారు. ఏంజెల్ లా కనువిందు చేసిన ఆ చిన్నారి అబ్బురంగా చూశారు. ఐఫిల్ టవర్ లో జరిగిన ‘లులూ ఎట్ జీజీ’ సంస్థ నిర్వహించిన చైల్డ్స్ కాస్ట్యూమ్ ఫ్యాషన్ షోలో పాల్గొంది.

డైసీది బ్రిటన్ లోని బర్మింగ్ హామ్. డబుల్ యాంప్యూటీ, ఫైబ్యులర్ హెమిమెలియాతో జన్మించింది. ఈక్రమంలో 18నెలల వయస్సులోనే మోకాళ్ల కింది భాగంలో వచ్చిన లోపాలతో కాళ్లు కోల్పోయింది. డైసీకి ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు. ఆడుతు పాడుతు గెంతులేస్తు..పెరగాల్సిన డైసీ వీల్ చైర్ కే పరిమితం అయిపోయింది. అయినా ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. కాళ్లు లేకపోయినా ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసంతోనే పెరిగింది. పిల్లలు చేసే ఫ్యాషన్ షోలో ఎంట్రీ ఇచ్చింది. ఫ్యాషన్ షోలో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ఆర్టిఫిషియల్ కాళ్లతోనే ర్యాంప్ పై క్యాట్ వాక్ చేసింది. ఈ ప్రతిభకు..ఆత్మస్థైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పలు బ్రిటన్ సంస్థలు తమ కాస్ట్యూమ్స్ కు మోడల్ గా నియమించుకున్నారు.

లండన్ లో 2019 ఫిబ్రవరిలో జరిగిన వీక్ లోనే కాక..న్యాయార్క్ ఫ్యాషన్ వీక్ లో కూడా ప్రముఖ ఫ్యాషన్ ప్రియులను..విశ్లేషకులను సైతం డైసీ ఆకట్టుకుంది. ప్రశంసలు పొందింది. అంతేకాదు 10 ఏళ్ల వయస్సులోనే డైసీ మే తలాంటివారి కోసం పనిచేస్తోంది. అవయవాలు తొలగించిన పిల్లల కోసం టెనెరిఫేలో ఒక శిబిరాన్నికూడా నిర్వహిస్తోందీ. అవయవలోపాలు ఉన్నా ఏదోకటి సాధిస్తారని పిల్లలకు స్ఫూర్తినిచ్చే మాటలు చెబుతుంది.
మొహంమీద ఎప్పుడూ చిరునవ్వు చెరగనివ్వదు. ఆ పాపను చూస్తే చిరునవ్వు కూడా మురిసిపోతుందేమో..ఆ చిట్టి పెదవులపై నాట్యమాడాలని. క్యాట్ వాక్ ఒక్కటే కాదు పాటలు పాడటం, డ్యాన్స్ చేయటంలో కూడా దిట్ట ఈ చిన్నారి. డైసీ మే న్యూయార్క్, లండన్, పారిస్ లలో పలు ఫ్యాషన్ లోనే పాల్గొని ఎంతోమంది ప్రశంసలు అందుకుంది.

తన చిన్నారి ఆత్మవిశ్వాసానికి తండ్రి మురిసిపోతుంటాడు. కాళ్లు లేకుండా తన బిడ్డ ఎలా బతుకుతుందోనని ఆందోళన పడ్డాననీ..దాంతో మద్యానికి బానిసగా మారిపోయాననీ..బిడ్డను ఆ స్థితిలో చూసి తట్టుకోలేక చనిపోవాలని కూడా అనుకున్నానని కానీ డైసీని భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నానని కన్నీళ్లతో చెబుతున్నాడు ఆ తండ్రి. డైసీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.అన్నట్లు జిమ్ లో డైసీ చేసే వర్క్ అవుట్లు చూస్తే షాక్ అయిపోతాం. అంతేకాదు డైసీ చేసే ఫీట్లు చూస్తే నిజంగా ఆచిన్నారికి కాళ్లు లేకపోవటం నిజం కాదేమో అనిపిస్తుంది. మరి మీరు కూడా చూడండీ ఈ చిచ్చరపిడుగు చేసే ఫీట్లు.