మాస్కులాగా మొహానికి ఏకంగా ఫైథాన్ పామునే చుట్టేసుకున్నాడు

  • Published By: nagamani ,Published On : September 16, 2020 / 02:52 PM IST
మాస్కులాగా మొహానికి ఏకంగా ఫైథాన్ పామునే చుట్టేసుకున్నాడు

కరోనా నియంత్రణకు మాస్క్ మస్ట్. ప్రపంచంలోని అన్ని దేశాలు మాస్కులను తప్పనిసరి చేశాయి. నోరు, ముక్కును కప్పి ఉంచుకోండి. మాస్కు మాత్రమే ధరించాలన్న రూల్ ఏమీలేదు..నోరు..ముక్కు కవర్ చేసేలా స్కార్ఫ్ కట్టుకున్నా ఫరవాలేదు. కానీ కచ్చితంగా నోరుగానీ..ముక్కుకానీ కనిపించకుండా కవర్ చేసుకోవాలి అనే రూల్ ఉంది.


కానీ నోరు..ముక్కు కవర్ చేసుకోవాలని చెప్పారు కదాని ఓ వ్యక్తి ఏకంగా తన నోరు..ముక్కు కనిపించకుండా ఓ పేద్ద పాముని చుట్టేసుకున్నాడు. అలా పేద్ద పైథాన్ పాముని ముఖానికి మాస్క్ లాగా చుట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో తిరిగేస్తున్నాడు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో కూడా అలాగే పాముని ముఖానికి చుట్టుకుని తిరిగేస్తున్న ఘటన ఇంగ్లండ్‌లో జరిగింది.


ప్రభుత్వం పెట్టిన మాస్క్ నిబంధనను బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి పాముని మాస్క్ లాగా చుట్టుకుని సాల్‌ఫోర్డ్‌లోని స్వింటన్ నుంచి మాంచెస్టర్ సిటీ సెంటర్‌కు వెళ్లే బస్సు ఎక్కాడు. అదిచూసినవారంతా పాములాంటి డిజైన్ మాస్క్ అనుకున్నారు. కానీ ఆ పాము మెల్లగా కదలడం గమనించిన వారు లబోదిబోమన్నారు. పరుగులు పెట్టారు. కొంతమంది పాము మాస్క్ ను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అవికాస్తా వైరల్ అయ్యాయి.



https://10tv.in/kerala-officials-of-air-intelligence-unit-at-calicut-international-airport-have-seized-700-gms-gold-inside-a-pressure-cooker/
అవి అధికారులు..పోలీసుల దృష్టికి వెళ్లటంతో అతన్ని పట్టుకుని ముక్కూ..నోరు కనిపించకుండా కవర్ చేయమంటే పాములతో కాదు..అంటూ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తరువాత ట్రాన్స్‌పోర్టు అధికారులు..ఇటువంటి తలనొప్పులు ఎందుకని మరింత స్పష్టంగా మాస్క్ లు ఎలాంటివి ఉండాలో తెలిపేలాగా చాలా చాలా వివరంగా మార్గదర్శకాలలో తగు మార్పులు చేశారు.పామును మాస్క్ లాగా వినియోగించకూడదని సదరు వ్యక్తిని హెచ్చరించారు.