Omicron Cases In UK : బ్రిటన్ లో 246 ఒమిక్రాన్ కేసులు..ఒక్కరోజులోనే 50శాతానికి పైగా

బ్రిటన్ లో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు భారీగా నమోదవుతున్నాయి. శనివారం నాటికి నమోదైన కేసులతో పోల్చితే

Omicron Cases In UK : బ్రిటన్ లో 246 ఒమిక్రాన్ కేసులు..ఒక్కరోజులోనే 50శాతానికి పైగా

Omicron (1)

Omicron Cases In UK :  బ్రిటన్ లో కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”కేసులు భారీగా నమోదవుతున్నాయి. శనివారం నాటికి నమోదైన కేసులతో పోల్చితే ఇవాళ ఒక్కరోజే 50శాతానికి పైగా కేసులు అధికంగా నమోదయ్యాయి. బ్రిటన్ లో శనివారం నాటికి 160 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా,తాజాగా 86 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 246కి చేరుకుందని బ్రిటన్ ఆరోగ్యశాఖ  తెలిపింది. అయితే వీటిలో అత్యధికంగా నైజీరియా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారిలోనే ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది.

మరోవైపు,డిసెంబర్ నెలలో క్రిస్మస్ సంబరాల నేపథ్యంలో బ్రిటన్ లో ఒమిక్రాన్ వ్యాప్తిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కనుక కఠిన ఆంక్షలను తీసుకురాకుంటే క్రిస్మస్ తర్వాత పరిస్థితి దారుణంగా మారే అవకాశముందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ వల్ల హాస్పిటల్స్ చేరికలు కనుక పెరిగితే..పరిస్థితి చాలా,చాలా కష్టంగా మారుతుందని బ్రిటన్ హెల్త్ డిపార్ట్మెంట్-నేషనల్ హెల్త్ సర్వీస్ హెచ్చరించింది.

ఇక,ఒమిక్రాన్ వ్యాప్తిని నిలువరించడానికి షాపుల్లో,ప్రజా రవాణాలో,దేశంలోకి వచ్చే వారందరికీ ప్రీ డిపాశ్చర్(బయలుదేరే ముందు)టెస్టింగ్ తప్పనిసరి వంటి పలు ఆంక్షలను బ్రిటన్ సర్కార్ ఇప్పటికే తిరిగి ప్రవేశపెట్టింది. నైజీరియా సహా ఆఫ్రికా తొమ్మిది దేశాలను బ్రిటన్ రెడ్‌ లిస్ట్‌లో ఉంచింది. కేవలం బ్రిటన్‌కు సంబంధించిన వారిని మాత్రమే దేశంలోకి అనుమతిస్తున్నారు. ఇకపై బ్రిటన్‌కు రావాలనుకునేవారు రెండు రోజులముందే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, నెగెటివ్‌ వస్తేనే అనుమతిస్తామని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్ ఎంతవరకు ప్రభావం చూపుతుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని బోరిస్ జాన్సన్ తెలిపారు.

ALSO READ Vaishno Devi Temple : వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాలంటే ఇకపై అది తప్పనిసరి