PM Rishi Sunak ..King Charles III : బ్రిటన్ కింగ్ చార్లెస్ పట్టాభిషేకం బైబిల్ చదవనున్న రిషి సునాక్

బ్రిటన్ రాజకుటుంబంలో రాజుకు పట్టాభిషేకం మహోత్సవంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న రిషి సునాక్ సంప్రదాయాన్ని పాటిస్తారు. బ్రిటన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధానులు పాటించే ఆనవాయితీనే సునాక్ కూడా పాటించనున్నారు. ఈ వేడుకల్లో సునాక్ పత్యేక పాత్ర..

PM Rishi Sunak ..King Charles III : బ్రిటన్ కింగ్ చార్లెస్ పట్టాభిషేకం బైబిల్ చదవనున్న రిషి సునాక్

PM Rishi Sunak ..King Charles III

PM Rishi Sunak..King Charles III : 70 ఏళ్ల తరువాత బ్రిటన్ రాజకుటుంబంలో రాజుకు పట్టాభిషేకం మహోత్సవంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న రిషి సునాక్ సంప్రదాయాన్ని పాటిస్తారు. క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తరువాత బ్రిటన్ రాజుగా చార్లెస్-3 పట్టాభిషిక్తులు అవుతున్నారు. అంగరంగవైభవంగా జరగనున్న పట్టాభిషేక కార్యక్రమంలో ఆయనకు అధికారికంగా కిరీటధారణ చేయనున్నారు. ఈ పట్టాభిషేక కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా యూకే ప్రధాని భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ రాజకుటుంబ సంప్రదాయాల ప్రకారం.. బైబిల్ పఠనం చేయనున్నారు.

King Charles III Coronation : కింగ్ చార్లెస్ పట్టాభిషేక మహోత్సవానికి హాజరవుతున్న భారతీయులు వీరే..

బ్రిటన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధానులు బైబిల్ పఠించడం ఆనవాయతీగా వస్తోంది. ఈ ఆనవాయతీని రిషి సునాక్ కూడా పాటిస్తారు. బైబిల్ లోని కొన్ని ఎంపిక చేసిన ప్రత్యేక వాక్యాలను చదువుతారు. బైబిల్ లోని కొలొస్సియన్స్ రాసిన పత్రికలో ఉన్న వాక్యాలను సునాక్ పఠించనున్నారు. సర్వజనులపై క్రీస్తు ప్రేమను ప్రతిబింబించేలా ఈ బైబిల్ పఠనం ఉంటుంది. హిందు మతాన్ని విశ్వసిస్తు పాటించే సునాక్ రాజ్ చార్లెస్ పట్టాభిషేకం కార్యక్రమంలో బైబిల్ చదవటం అనేది రాజకుటుంబం పాటించే మర్యాదల్లో భాగంగానే ఉంటుంది.

కాగా లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో ఈ పట్టాభిషేక కార్యక్రమం జరగుతుంది. బ్రిటన్ రాజకుటుంబీకులు, ప్రభుత్వ పెద్దలతో పాటు దేశవిదేశాల నుంచి దాదాపు రెండు వేలమందిప్రముఖులు దేశదేశాల నుంచి హాజరుకానున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ దంపతులు, బాలివుడ్ నటి సోనమ్ కపూర్ తో పాటు పలువురు భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

King Charles Coronation : బ్రిటన్ కింగ్ ఛార్లెస్‌కు ముంబై డబ్బావాలాల ‘పునెరీ పగఢీ’ కానుక .. దీని ప్రత్యేక ఏమిటంటే..