King Charles Coronation : బ్రిటన్ కింగ్ ఛార్లెస్‌కు ముంబై డబ్బావాలాల ‘పునెరీ పగఢీ’ కానుక .. దీని ప్రత్యేక ఏమిటంటే..

పట్టాభిషిక్తుడు కానున్న రాజు చార్లెస్ కు ముంబై డబ్బావాలాలు ప్రత్యేకమైన అపురూపమైన కానుకగా పంపారు.

King Charles Coronation : బ్రిటన్ కింగ్ ఛార్లెస్‌కు ముంబై డబ్బావాలాల ‘పునెరీ పగఢీ’ కానుక .. దీని ప్రత్యేక ఏమిటంటే..

Mumbai Dabbawalas Gifts To King Charles

King Charles coronation : బ్రిటన్‌ రాజుకు ముంబై డబ్బావాలాలు ప్రత్యేక కానుక పంపించారు. మే 6(2023)న పట్టాభిషిక్తుడు కానున్న రాజు చార్లెస్ కు ముంబై డబ్బావాలాలు ‘పునెరీ పగఢీ’ని (సంప్రదాయ తలపాగా) కానుకగా పంపారు. 2003లో ఛార్లెస్‌-3 భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు వారిని కలిసి సేవలను ప్రశంసించారు.దీంతో ముంబై డబ్బావాలాలు రాజు పట్టాభిషేకం సందర్భంగా తమ వంతు కానుకగా పురుషులు హోదాకు, గౌరవానికి ప్రతీకగా భుజాలపై ధరించే పునెరీ పగఢీని పంపించారు.

క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తరువాత రాజుగా కింగ్ చార్లెస్ పట్టాభిషేకం జరుగనుంది. ఈ వేడుక సందర్భంగా ముంబై డబ్బావాలాలు చార్లెస్ కు తమ సంప్రదాయ తలపాగాను కానుకగా పంపించారు.‘పునెరీ పగఢీ’తో పాటు పురుషులు మెడలో ధరించే కండువాను (ఉపర్నీ) కూడా పంపించారు. మహారాష్ట్రలోని పుణె నగరంలో 19వ శతాబ్దం నుంచి హోదాకు, గౌరవానికి ప్రతీకగా పునెరీ పగఢీని ధరిస్తారు. సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో ఉపర్నీని పురుషులు ధరిస్తారు.

kohinoor diamond : కోహినూర్ వజ్రం కనిపించకుండానే కింగ్ చార్లెస్ పట్టాభిషేకం ..!! ఎందుకంటే..

అటువంటి గౌరవనీయమైన చిహ్నాలను బ్రిటన్ రాజుకు పంపించారు డబ్బావాలాలు. బ్రిటన్ రాజు పట్టాభిషేకానికి తమకు ఆహ్వానించకపోయినా ఆయన భారత్ వచ్చినప్పుడు తమపై చూపించిన అభిమానానికి..తాము చేసే పనిని గౌరవించి గుర్తించిన ఆ ఘటన మాకు ఎప్పటి గుర్తుండిపోతుందని అందుకే ఈ అపురూప కానుకను పంపించామని డబ్బావాలాల సంఘం అధ్యక్షుడు రాందాస్‌ కర్వాండే తెలిపారు.

ఇటీవల ముంబైలో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమానికి తమలో కొందరిని బ్రిటన్‌ దౌత్య అధికారులు పిలిచారని..ఈ సందర్భంగా వారికి పునెరీ పగఢీని, ఉపర్నీని అందజేశామని రాందాస్‌ కర్వాండే గురువారం (మే 4,2023) తెలిపారు. కాగా ముంబై డబ్బావాలాలకు బ్రిటన్‌ రాజ కుటుంబంతో సుదీర్ఘకాలంగా సంబంధాలు కొనసాగుతున్నాయి. 2003లో ఛార్లెస్‌-3 భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు వారిని కలిసి సేవలను ప్రశంసించారు. ఆ అభిమానంతో ముంబై డబ్బావాలాలు ఈ అపురూప కానుకలను పంపించామని తెలిపారు.

 

King Charles III..Camilla : కింగ్ ఛార్లెస్‌-3, కెమిల్లా 35 ఏళ్ల ప్రేమగాథ .. రాజకిరీటంపై హక్కు కోసం వీరేం చేశారంటే..