‘గే’ తమ్ముడి దంపతుల బిడ్డకు జన్మనిచ్చిన 42 ఏళ్ల అక్క..

‘గే’ తమ్ముడి దంపతుల బిడ్డకు జన్మనిచ్చిన 42 ఏళ్ల అక్క..

sister helpsher gay brother having a baby : యూకేకు చెందిన ఓ మహిళ తన తమ్ముడి కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఎవరూ చేయని పనికి పూనుకుంది. ‘గే’ తమ్ముడి కోసం తన ఆరోగ్యాన్నే కాదు తన కుటుంబాన్ని పణ్ణంగా పెట్టి సరోగసి ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే ఆరుగురు బిడ్డల తల్లి అయిన ఆ అక్క తమ్ముడి కోసం సాహసం చేసిందనే చెప్పాలి. తనకేమైనా అయితే తన ఆరుగురు బిడ్డల పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచించలేదు. సరోగసీ ద్వారా బిడ్డను కని తన తమ్ముడు ‘గే’ దంపతుల చేతిలో పెట్టింది. తన కోసం అక్క చేసిన త్యాగానికి ఆమె కాళ్లు మొక్కడా తమ్ముడు. అక్క కని ఇచ్చిన బిడ్డను చూసి ఆ ‘గే’దంపతులు తెగ మురిసిపోతున్నారు.

ఇంగ్లాడ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన ఆంథోనీ డీగన్, రే విలియమ్స్ ఇద్దరు స్వలింగ సంపర్కులు. ఈ గే దంపతులు ఎంతో కాలంగా ఓ బిడ్డ కావాలని ఆశపడుతున్నారు. కానీ వారు బిడ్డను కనే పరిస్థితి లేదు. దీంతో సరోగసి ద్వారా బిడ్డకు పొందాలని ఆశపడ్డారు. కానీ అది ఎలా? అనే విషయంపై అవగాహన పెంచుకోవటానికి యూకేలోని పలు స్వచ్చంద సంస్థలు ఏర్పాటు చేసిన సరోగసి అవగాహనా కార్యక్రమాలకు అటెండ్ అయ్యేవారు. వివరాలన్నీ తెలుసుకునేవారు. అలా సంవత్సరం పాటు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. బిడ్డ కావాలనుకునే వారి ఆశలు ఫలించలేదు.

ఈ విషయం అంథోని సోదరి ట్రేసీ హల్స్‌కు తెలిసింది. నీ కోసం నేను సరోగసి ద్వారా బిడ్డను కని ఇస్తానని మాటిచ్చింది. కానీ అప్పటికే ఆమెకు 42 ఏళ్లు..పైగా ఆరుగురు బిడ్డల తల్లి. తమ్ముడి కోసం ఆమె రిస్క్ తీసుకోవటానికి ఏమాత్రం వెనుకాడలేదు. కానీ ట్రేసీ హల్స్ భర్త మాత్రం అడ్డుచెప్పాడు.

ఆరుగురు పిల్లలకు తల్లివి ఇది ఎంతవరకూ సక్సెస్ అవుతుంది? ఈ సరోగసీ ప్రక్రియలో నీ ఆరోగ్యం పాడవుతుందేమో ఆలోచించు..జరగరానిదేమన్నా జరిగితే మన బిడ్డల పరిస్థితి ఏంటో కాస్త ఆలోచించమని సూచించాడు. కానీ ట్రేసీ మాత్రం తన తమ్ముడి బిడ్డల తపన తీర్చాలని గట్టిగా చెప్పటంతో భర్త కూడా ఏమీ అనలేకపోయాడు. భార్యకు సహకరించాడు. కానీ ఏమవుతుందో ఏమోనని భయపడుతూనే ఉండేవాడు.దీంతో ఆ గే జంట సరోగసి ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు 36 వేల పౌండ్ల(36.8లక్షల) అప్పుకూడా తీసుకున్నారు. ఇద్దరు వీర్యాన్ని దానం చేసినప్పటికీ.. పుట్టబోయే బిడ్డకు బయోలాజికల్ తండ్రి ఎవరనే విషయాన్ని..తాము ఎప్పటికీ తెలుసుకోకూడదని ‘గే’ దంపతులు డిసైడ్ అయ్యారు. సరోగసి ద్వారా గర్భం దాల్చిన ట్రేసీ 2020 అక్టోబర్ 12న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

దీంతో అంథోని, రే దంపతుల ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. తమకు ఆ సంతోషాన్ని ఇచ్చిన అక్క రుణం ఈ జన్మలో తీర్చుకోలేనని అంథోని అక్కా బావలకు ధన్యవాదాలు తెలిపాడు. బిడ్డను ఎత్తుకుని మురిసిపోతున్న అంథోని మాట్లాడుతూ.. తన సోదరి ట్రేసీ తనకోసం చాలా రిస్క్ చేసిందనీ..దానికి తాను ఆమెకు ఎంత చేసినా తక్కువేనని తెలిపాడు. ట్రేసీ తనకు అక్కే అయినా చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ లా పెరిగామని తెలిపాడు.

నా అక్క ట్రేసీ తన కోసం చేసి ఈ సహాయం ఎన్నటికీ మరచిపోలేననీ..ఈ బిడ్డతో తమ మధ్య బంధాన్ని మరింతగా పెరిగిందని.. తన జీవితంలో ఇవి చాలా చాలా ప్రత్యేకమైన క్షణాలని నా అక్క నా కోసం చేసిన ఈ సహాయం వెలకట్టలేనిదని బిడ్డను ఎత్తుకుని మురిసిపోతూ చెప్పాడు అంథోని..