Afghanistan : అఫ్ఘాన్‌లో ఇక ఆకలి కేకలే – యూఎన్

ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంతో 1.4 కోట్ల మందికి తినడానికి తిండి కూడా దొరకదని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

Afghanistan : అఫ్ఘాన్‌లో ఇక ఆకలి కేకలే – యూఎన్

Afghanistan

Afghanistan :  ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంతో 1.4 కోట్ల మందికి తినడానికి తిండి కూడా దొరకదని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. కరోనా కారణంగా కకావికలమైన అఫ్ఘాన్.. తాలిబన్ చేతులోకి వెళ్లడంతో మరింత అద్వానంగా తయారు కానుందని తెలిపింది.

అధ్యక్షత ప్రభుత్వం పోవడంతో ప్రజలపై తీవ్రమైన ఆర్థిక, సామాజిక ప్రభావం కనిపిస్తుందని వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్స్‌కి చెందిన అఫ్ఘాన్ డైరెక్టర్‌ మేరి ఎలన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పంటల దిగుబడి తగ్గిందని… నిల్వ ఉన్న ఆహార ధాన్యాలు నాశనమయ్యాయని తెలిపారు.

దేశం తాలిబన్ల చేతిలోకి వెళ్లడంతో చాలామంది నిరాశ్రయులవుతున్నారు. వారికి బయపడి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. బయట ఎక్కడ ఆహారం దొరకడం లేదని తెలిపారు. మే నెలలో 40 లక్షల మంది ఆకలిని తీర్చామని, వచ్చే కొద్ది నెలల్లో 90 లక్షల మంది కడుపు నింపాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పటికీ ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని మేరి ఎలన్‌ తెలిపారు.

ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునైనా ఈ ఆకలి సంక్షోభాన్ని నివారించాలంటే, 20 కోట్ల అమెరికా డాలర్లు తక్షణావసరమని మేరి వివరించారు. ఇలాంటి పరిస్థితిల్లో అఫ్ఘాన్ కు అన్ని దేశాలు సాయం చేయాలనీ ఆమె విజ్ఞప్తి చేశారు.