Coober Pedy : ఊరంతా రత్నాల గనులే.. ఇళ్లన్నీ గుట్టల్లోనే

గుట్టల కింద ఉండే ఇళ్లు, ఊరి నిండా రత్నాల గనులు. రంగు రంగుల రత్నాలు ఉండే ఈ ఊరంతా గుట్టలే. ఏ గుట్ట కింద ఏ ఇల్లు ఉందో.. ఏ హోటల్ ఉందో..ఏ దేవాలయం ఉందో తెలియదు. అటువంటి ఓ వింత ఊరు ప్రపంచమంతా పేరొందింది.

Coober Pedy : ఊరంతా రత్నాల గనులే.. ఇళ్లన్నీ గుట్టల్లోనే

underground coober pedy houses

Opal Capital of World : అదొక విచిత్రమైన ఊరు. ఆ ఊర్లో నడిచేటప్పుడు ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం వేసే అడుగులు ఏ ఇంటి పైకప్పు మీదనో..ఏ హోటల్ టాప్ మీద వేస్తామో లేదా ఏ ప్రార్థనా మందిరం మీదనడుస్తామో అర్థం కాదు. కాస్త పరిశీలించి చూస్తేగానీ మనం నడిచేది ఎక్కడో అర్థం కాదు. ఎందుకంటే ఆఊళ్లో ఇళ్లు, హోటల్స్ ఆఖరికి ప్రార్ధనా మందిరాలు, షాపులు అన్నీ గుట్టల్లోనే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ అన్నీ భూగర్భంలోనే ఉంటాయి.

ఇన్నీ ప్రత్యేకలు ఉండే ఆ గ్రామంలో రత్నాల గనులు కోకొల్లలుగా ఉంటాయి. అందుకే ఈ ఊరు ‘ఓపల్‌ కేపిటల్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’గా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ అత్యంత విలువైన ‘ఓపల్‌’ రత్నాలు దొరుకుతాయి. రంగు రంగులతో మెరిసిపోయే రత్నాల గనులకు ప్రసిద్ది చెందింది.ఈ గ్రామాన్ని కాస్త దూరం నుంచి చూస్తే అన్నీ గుట్టల్లే కనిపిస్తాయి. దగ్గరకెళ్లి పరిశీలించి చూస్తే ఒక్కో గుట్టలో ఒక్కో ఇల్లు కనిపిస్తుంది. ఈ గ్రామంలో అడుగడుగునా గోతులు ఉంటాయి. గోతులు ఉన్నట్లుగా వార్నింగ్ బోర్డులు మాత్రం కనిపిస్తాయి. కొత్తవారికి ఈ బోర్డులు కాస్త ఉపయోగకరంగా ఉంటాయని చెప్పొచ్చు. మరి ఇంత వింతగా ఉండే ఈ ఊరు ఎక్కడుందో..ఆ ఊరు అలా ఎందుకు ఉందో తెలుసుకుందాం..

దక్షిణ ఆస్ట్రేలియాలో అడిలాయిడ్‌ నగరానికి 846 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ వింత ఊరు పేరు ‘కూబర్‌ పెడీ’(Coober Pedy). గ్రామ జనాభా దాదాపు 2,5000లు. పాతాళ గృహాలకు ఈ ఊరు పేరు.ఓపల్‌ గనులు (Opal mines)ఉండే ఈ గ్రామం ‘ఓపల్‌ కేపిటల్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ (Opal Capital of World )గా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ అత్యంత విలువైన ‘ఓపల్‌’ రత్నాలు దొరుకుతాయి.

ఈ ఓపల్‌ రత్నాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ ఊరి పరిధిలో దాదాపు డెబ్భైకి పైగా ఓపల్‌ గనులు ఉన్నాయి. ఈ గ్రామంలో ఇళ్లు, హోటల్స్, ప్రార్థనా మందిరాలు,పబ్బులు, షాపులు అన్నీ భూగర్భంలోనే ఉంటాయి. ఇలాంటి గ్రామం ఎక్కడా లేదు. అలా గుట్టల్లో అంటూ భూగర్భంలో ఉండటానికో కారణం కూడా ఉంది. ఈ గ్రామ ప్రజలు ఓపల్ గనుల్లో పనిచేస్తుంటారు.

మరి ఎందుకు అలా అన్ని భూగర్భంలో ఉన్నాయంటే..కూబర్‌ పెడీ అనే ఈ గ్రామం ఎడారి ప్రాంతంలో ఉంటుంది. వేసవిలో ఇక్కడి వేడి విపరీతంగా ఉంటుంది. ఆ వేడి తట్టుకోవటం చాలా కష్టం. వేసవిలో 50 నుంచి 113 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదవుతుంటాయి.ఈ ఎండల వేడిని తట్టుకుని, బతికి ఉండాలంటే ఇలా నివాసాలన్నీ భూగర్భంలో ఉండాల్సిందే. అందుకే ఆ గ్రామం అంతా భూగర్భంలోనే ఉంటుంది. పైకి అంత వేడి ఉండే ఆగ్రామం అడుగున మాత్రం చల్లగా ఉంటుంది.

దాదాపు 100 ఏళ్లకు పైగా ఈ ఓపల్‌ గనుల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఓపల్ రత్నాలు కోసం ఈ తవ్వకాలు జరుగుతుంటాయి. ఈ గ్రామ జనాభాలో దాదాపు 80శాతం మంది ఈ గనుల్లోనే పనిచేస్తుంటారు. ఆస్ట్రేలియాలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే..ఈ గ్రామంలో ఇళ్ల ధరలు కారుచౌకగా ఉంటాయి. దానికి కారణం ఆ ప్రాంతంలో ఉండే వేడి వాతవరణమే కారణం. మూడు బెడ్ రూముల ఇల్లు 41 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.21.83 లక్షలు ఉంటుంది.