One Years Boy Resume: నా డైపర్లు నేనే మార్చుకుంటా..స్నాక్స్ తినేస్తా..మైలు దూరంలో ఉన్న మా కుక్కను గుర్తు పట్టేస్తా..

నా డైపర్లను నేనే మార్చుకుంటా..స్నాక్స్ తినేస్తా..మైలు దూరంలో ఉన్న మా కుక్కను గుర్తు పట్టేస్తా..క్లీనింగ్ ప్లేసుని 30 సెకండ్లలో చిందరవందర చేసేస్తా..అంటూ ఏడాది వయస్సున్న పిల్లాడు నాకు ఉద్యోగం ఇవ్వండీ సార్ అంటూ ఇంటర్వ్యూకి వెళ్లాడు.

One Years Boy Resume: నా డైపర్లు నేనే మార్చుకుంటా..స్నాక్స్ తినేస్తా..మైలు దూరంలో ఉన్న మా కుక్కను గుర్తు పట్టేస్తా..

One Years Boy Resume Cv (1)

One Years Boy resume CV : ఒక్క సంవత్సరం వయస్సున్న పిల్లాడు తన తల్లితో పాటు ఇంటర్య్వూకి వెళ్లాడు. తల్లితో పాటు తన రెజ్యూమ్ కూడా ఇచ్చాడా గడుగ్గాయి. ఈ రెజ్యూమ్ లో తనకు ఉన్న ప్రతిభ గురించి కూడా వివరించాడు. నేను అమ్మ పెట్టిన స్నాక్స్ మొత్తం తినేస్తానని..మైలు దూరంలో ఉన్నాసరే తన కుక్కను కూడా గుర్తు పడతానని స్కిల్స్ లిస్టులో రాశాడు. దాన్ని ఆ పిల్లాడి తల్లి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఈ చిచ్చరపిడుగు క్యూట్ ఇంటర్వ్యూ గురించి..

అమెరికాకు చెందిన మ్యాగీ ముండ్విల్లర్ అనే టిక్ టాక్ యూజర్. 38 ఏళ్ల మ్యాగీ కరోనా తెచ్చిన సంక్షోభంతో ఉద్యోగం కోల్పోయింది. దీంతో మరో ఉద్యోగం కోసం యత్నిస్తోంది. అలా చాలా ఇంటర్వ్యూలను ఫేస్ చేసింది. కానీ ఫలితం లేదు. అలా ఉద్యగం ప్రయత్నంలో భాగంగా మరో సారి యత్నించగా..ఒక కంపెనీ నిర్వహించే ఇంటర్వ్యూకు ఆమె వెళ్లింది. అలా వెళుతూ తన సంవత్సరం వయస్సున్న కుమారుడిని కూడా తీసుకెళ్లింది. ఎందుకంటే తన కొడుకుని చూసుకోవటానికి ఎవ్వరూ లేకపోవటంతో తనతోపాటే ఇంటర్వ్యూకి తీసుకెళ్లింది. దాని కోసం పర్మిషన్ కూడా తీసుకుంది. పనిలో పనిగా సరదాగా ఉంటుందని ఇంటర్వ్యూకు రెడీ చేసింది. దాన్ని వీడియో తీసి టిక్ టాక్ షేర్ చేసింది.

బుడతడి క్వాలిఫికేషన్లు లిస్టు..
తల్లి సహాయంతో ఆ బుడతడు సీవీని రెడీ చేశాడు. సదరు కంపెనీకి తను ఎందుకు అవసరమో వివరిస్తూ తన స్కిల్స్ లిస్టును రాసుకొచ్చాడు. ఆ లిస్టులో..”నీట్ గా ఉన్న ప్లేసుని 30 సెకన్లలో చిందరవందర చేసేస్తాను, నా డైపర్లను నేనే మార్చుకుంటాను, బంతి చాలా ఫాస్టుగా విసురుతాను, నా కుక్కను మైలు దూరంలో ఉన్నా గుర్తు పట్టేస్తాను” అని పలురకాల స్కిల్స్ ను సీవీలో రాశాడు. ఇటువంటి పనులు చేయటంలో మంచి ఎక్స్ పీరియన్స్ ఉందని పేర్కొన్నాడు. అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కు సరికి.. మమ్ అండ్ డాడ్ యునివర్సిటీ అని ఉంది. రికమండేషన్ జాబితాలో కూడా మమ్ అండ్ డాడ్ అని పేర్కొనడం మరో విశేషం. ఎంతో ఫన్నీగా ఉన్న ఈ రెజ్యూమ్ టిక్ టాక్ వీడియో.. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టేస్తోంది.డుతోంది.

ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 9 మిలియన్ల మంది చూశారు. అంతేకాకుండా వేల మంది కామెంట్లు పెట్టారు. ఇదిలా ఉంటే మ్యాగీ తన ఇంటర్వ్యూ బాగానే పూర్తి చేసింది. కంపెనీ నుంచి వచ్చే కాల్ కోసం ఆశగా వెయిట్ చేస్తోంది. అదే విషయాన్ని ఆమె టిక్ టాక్ వీడియోలో వెల్లడించింది.