US Job : CC టీవీ ఫుటేజ్ చూడటమే జాబ్..నెలకు రూ.30 వేల జీతం

వీడియోలు చూస్తే కూర్చుంటే నెలకు రూ.30,000 జీతం ఇస్తామంటున్నాయి అమెరికా కంపెనీలు. పని ఏమీ చేయనక్కరలేదు..కేవలం సీసీ టీవీ ఫుటేజ్ చూస్తూ కూర్చుంటే చాలు..నెలకు 399 డాలర్లు (రూ.30 వేలు) ఇస్తామంటున్నాయి.

US Job : CC టీవీ ఫుటేజ్ చూడటమే జాబ్..నెలకు రూ.30 వేల జీతం

Us Company

US company Watch Live CCTV Feed For Rs.30,000 Salary: కొన్ని ఉద్యోగాలు గంటల తరబడి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని ఉద్యోగాలు ఆహార పదార్ధాలను టేస్ట్ చూసి చెబితే చాలు చక్కటి జీతం వస్తుంది.కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఉద్యోగం భలే చిత్రమైనదనే చెప్పాలి.కేవలం వీడియోలు చూస్తే కూర్చుంటే చక్కటి జీతం ఇస్తామంటున్నాయి కొన్ని కంపెనీలు. అమెరికాకు చెందిన కంపెనీలు ఇటువంటి ఉద్యోగాన్ని ఇస్తామంటున్నాయి. పని ఏమీ చేయనక్కరలేదు..కేవలం సీసీ టీవీ ఫుటేజ్ చూస్తూ కూర్చుంటే చాలు..నెలకు 399 డాలర్లు (రూ.30 వేలు) ఇస్తామంటున్నాయి.

వర్చువల్ సూపర్‌వైజర్‌ అని ఈ జాబ్ పేరు. దీంట్లో ఉద్యోగి చేయాల్సిన పని ఏమంటే..షాపింగ్ మాల్స్, స్టోర్స్‌లలో లైవ్ సీసీటీవీ ఫుటేజ్‌ను గమనిస్తూండాలి. అనుమానిత వ్యక్తుల గురించి క్యాషియర్‌కు చెప్పాలి. అమెరికా కంపెనీలు అంటే అమెరికా వెళ్లి ఈ పనిచేయనక్కరలేదు..భారత్‌లో కూర్చొనే ఈ పని చేయవచ్చనే అవకాశాన్ని కల్పిస్తున్నాయి అమెరికా కంపెనీలు. ఈ ఉద్యోగాల్లో భారతీయులకే ఆమెరికా కంపెనీలు మొదటి ప్రాధాన్యం ఇవ్వటం మరో విశేషం.

హెల్, 7-ఎలెవన్, డైరీ క్వీన్, హాలీడే ఇన్ వంటి ప్రముఖ సంస్థలు తమ స్టోర్స్‌లో మోసాలను అరికట్టేందుకు ఇటువంటి విధానాన్ని ఎంచుకున్నాయి. ఈ ఉద్యోగానికి అపాయింట్ అయిన వ్యక్తి వర్చువల్ సూపర్ వైజర్‌గా వ్యవహరిస్తూ లైవ్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తూ ఉండాలి. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి స్టోర్‌లోని ఫ్రిజ్‌లో ఉన్న కూల్‌డ్రింక్ తాగేసి.. క్యాషియర్ దగ్గరకు వచ్చాక తన కార్ట్‌లో ఉన్న వస్తువులకు మాత్రమే బిల్లు చెల్లిస్తున్నాడనుకోండి.. ఆ వ్యక్తి ఫ్రిజ్‌లో డ్రింక్ తాగినట్టు మైక్ ద్వారా క్యాషియర్‌కు చెప్పి అలెర్ట్ చేయాలి.

అలాగే కొంతమంది మాల్స్ లోను..స్టోర్స్ లోను బిస్కెట్లు, చాక్లెట్స్ తినేయటం..ఐస్ క్రీమ్ లు నాకి మళ్లీ పెట్టేయటం..లేదా పూర్తిగా తినేయటం..చేస్తుంటారు. తరువాత ఏమీ తెలియనట్లు వారు తీసుకున్న వస్తువులకుమాత్రమే బిల్ వేయించుకుంటారు. అటువంటివారిని గుర్తించి క్యాషియర్ కు తెలియజేయటం ఈ ఉద్యోగి చేయాల్సిన పనులు.