US Delta Variant : అమెరికాలో ‘డెల్టా’ విజృంభణ.. మూడు వారాల్లో రెట్టింపు కేసులు

అమెరికాపై డెల్టా కరోనా పంజా విసురుతోంది. వ్యాక్సినేషన్​ నెమ్మదించడంతో కరోనా కొత్త కేసులు మళ్లీ వేగంగా పెరిగిపోతున్నాయి. మూడు వారాల్లోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్ కారణమని నిపుణలు హెచ్చరిస్తున్నారు.

US Delta Variant : అమెరికాలో ‘డెల్టా’ విజృంభణ.. మూడు వారాల్లో రెట్టింపు కేసులు

Us Covid 19 Case Are Doubling Over Three Weeks, Experts Blame Fast Spreading Delta Variant

Updated On : July 14, 2021 / 9:01 AM IST

US Covid-19 case doubling over three weeks : అమెరికాపై డెల్టా కరోనా పంజా విసురుతోంది. వ్యాక్సినేషన్​ నెమ్మదించడంతో కరోనా కొత్త కేసులు మళ్లీ వేగంగా పెరిగిపోతున్నాయి. మూడు వారాల్లోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్ కారణమని నిపుణలు హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో జూన్ 23నాటికి 11,300గా కరోనా కేసులు నమోదు కాగా.. సోమవారం రోజున రోజువారీ కరోనా కేసులు సగటున 23,600 కేసులు నమోదయ్యాయని Johns Hopkins University డేటా వెల్లడించింది. గత రెండు వారాల్లో మెయినే, సౌత్ డకొటా అనే రెండు రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు భారీగా పెరిగినట్టు పేర్కొంది. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

కానీ, వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడంతో డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 55.6 శాతం మంది అమెరికన్లకు కనీసం ఒక మోతాదు కరోనా వ్యాక్సిన్ అందించినట్టు డేటా తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో రెండు వారాల్లో తక్కువ వ్యాక్సినేషన్ రేటు నమోదైంది. అందులో మిస్సౌరీ, 45.9శాతం, అర్కాన్సాస్, 43శాతం, నెవాడా, 50.9శాతం, లూసియానా 39.2శాతం, ఉటా 49.5శాతంగా ఉన్నాయి.