US COVID-19 vaccine: అగ్రరాజ్యంలో వేగంగా వ్యాక్సినేషన్.. ఒక్క రోజు రికార్డ్ ఇదే!

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తోంది. డెల్టా వేరియంట్ వల్ల దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది.

US COVID-19 vaccine: అగ్రరాజ్యంలో వేగంగా వ్యాక్సినేషన్.. ఒక్క రోజు రికార్డ్ ఇదే!

Vaccination

US COVID-19 vaccine: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తోంది. డెల్టా వేరియంట్ వల్ల దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ క్రమంలో ప్రజలంతా మరోసారి తప్పనిసరిగా మాస్కు ధరించాలనే నిబంధనను మళ్లీ అమెరికాలోని అనేక రాష్ట్రాలు అమల్లోకి తెచ్చాయి. ఇదే సమయంలో ప్రజలు వ్యాక్సిన్ కచ్చితంగా వేయించుకునేలా ఏర్పాటు చేశాయి.

లేటెస్ట్‌గా న్యూయార్క్, లాస్ ఏంజెలిస్ వంటి సిటీల్లో రెస్టారెంట్లు, జిమ్ముల వంటి ఇండోర్ సదుపాయాలు వినియోగించుకునేందుకు వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ని కంపల్సరీ చేశారు. ఈ క్రమంలోనే అమెరికాలో శనివారం(14 ఆగస్ట్ 2021) దాదాపు 1 మిలియన్(పది లక్షలు) మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించారు అధికారులు.

డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతున్న కొద్దీ వేగంగా వ్యాక్సిన్ వేస్తున్నట్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఒకే రోజు 9లక్షల 91వేల డోసులను ఇవ్వడం రికార్డుగా అధికారులు చెబుతున్నారు. జూలై మధ్యలో 4లక్షల మందికి డోసులు ఇవ్వడం ఇప్పటివరకు రికార్డుగా ఉంది. ఇప్పుడు అంతకంటే డబుల్ డోసులు ఇవ్వడం జరిగింది.

కరోనా సమయంలో వ్యాధులు పెరగడంతో అనేక రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, అర్కాన్సాస్, మిసిసిపీ మరియు లూసియానాతో సహా కరోనా కేసులు పెరుగుతుండడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. CDC డేటా ప్రకారం, US జనాభాలో దాదాపు 60% మంది కనీసం ఒక మోతాదు వ్యాక్సిన్, 51% మంది పూర్తిగా వ్యాక్సిన్‌లు వేశారు.