నమస్తే బైడెనా..బైబై ట్రంపా : ఇంకా కౌంటింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో లీడ్ లో ఉన్నదెవరు?

  • Published By: venkaiahnaidu ,Published On : November 6, 2020 / 12:21 PM IST
నమస్తే బైడెనా..బైబై ట్రంపా : ఇంకా కౌంటింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో లీడ్ లో ఉన్నదెవరు?

US election 2020: Who has lead in states still counting? అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. అధ్యక్షుడిగా బైడెన్​ విజయం దాదాపు ఖరారైనట్లేనని అందరూ భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే 538 సభ్యులున్న ఎలక్టోరల్‌ కాలేజీలో 270 ఓట్లు కావాలి. ప్రస్తుతం డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించి మ్యాజిక్‌ ఫిగర్ ‌కు అత్యంత చేరువలో ఉన్నారు. ఇక ట్రంప్‌కు 214 ఓట్లు వచ్చాయి.



ప్రస్తుతం 5 రాష్ట్రాలు..నెవాడా,జార్జియా,పెన్సిల్వేనియా,నార్త్‌ కరోలినా, అలస్కాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నెవాడాలో 6, జార్జియాలో 16, పెన్సిల్వేనియాలో 20, నార్త్‌ కరోలినాలో 15 అలస్కాలో 3 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో విజయం సాధించినా డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చుంటారు. ఇక ఈ ఐదు రాష్ట్రాల్లో విజయం సాధిస్తే డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడవుతారు. ప్రస్తుతం కీలకంగా మారిన ఈ ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు పక్రియ ఇంకా కొనసాగుతోంది.



అయితే,ఇంకా కౌంటింగ్ జరుగుతున్న5 రాష్ట్రాల్లో ఎవరు ఆధిక్యంలో ఉన్నరనేది చూద్దాం.



https://10tv.in/suspense-in-the-us-presidential-election/
జార్జియా-16 ఎలక్టోరల్ ఓట్లు
ఇక్కడ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే బైడెన్ కి ఆయనకి మధ్య పెద్ద తేడా ఏం లేదు. ట్రంప్ కి బైడెన్ కి మధ్య ఓట్ల తేడా 2వేలు మాత్రమే. ఇక్కడ ట్రంప్ కి ఇప్పటివరకు 24లక్షల 47వేల 223 ఓట్లు రాగా…జో బైడెన్ కు 24లక్షల 45వేల 321 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ పూర్తయ్యే లోపల ఏమైనా జరుగవచ్చు. అయితే ఇక్కడ ట్రంప్ కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇంకా లెక్కించాల్సిన ఓట్లు ఎన్ని : 15వేల ఓట్లు ఇంకా లెక్కించాల్సి ఉందని అధికారులు తెలిపారు.



పెన్సిల్వేనియా-20ఎలక్టోరల్ ఓట్లు
ఇక్కడ కూడా ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే బైడెన్ కూడా ట్రంప్ కి గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక్కడ ట్రంప్ కి ఇప్పటివరకు 32లక్షల 85వేల 445 ఓట్లు రాగా…జో బైడెన్ కు 32లక్షల 62వేల 869 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ కూడా ట్రంప్ కే గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇంకా లెక్కించాల్సిన ఓట్లు ఎన్ని : 5లక్షల 50వేల ఓట్లు ఇంకా లెక్కించాల్సి ఉందని అధికారులు తెలిపారు.



అరిజోనా-11ఎలక్ట్రోరల్ ఓట్లు
ఇక్కడ బైడెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ట్రంప్ కి బైడెన్ కి మధ్య ఓట్ల తేడా 47వేలు. ఇక్కడ బైడెన్ కి ఇప్పటివరకు 15లక్షల 32వేల 062 ఓట్లు రాగా…ట్రంప్ కు 14లక్షల 85వేల 10 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ బైడెన్ కే గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇంకా లెక్కించాల్సిన ఓట్లు : 4లక్షల 700వేల ఓట్లు ఇంకా లెక్కించాల్సి ఉందని అధికారులు తెలిపారు.




నెవెడా-6ఎలక్టోరల్ ఓట్లు

ఇక్కడ కూడా బైడెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దాదాపు 12వేల ఓట్ల ఆధిక్యంతో బైడెన్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ బైడెన్ కి ఇప్పటివరకు 6లక్షల 4వేల 251 ఓట్లు రాగా…ట్రంప్ కు 5లక్షల 92వేల 813 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ బైడెన్ కే గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇంకా లెక్కించాల్సిన ఓట్లు: 1లక్ష 90వేల ఓట్లు ఇంకా లెక్కించాల్సి ఉందని అధికారులు తెలిపారు.