US fighter jet: కెనడా గగనతలంపై గుర్తు తెలియని వస్తువును పేల్చివేసిన అమెరికా విమానం
తమ గగనతలంపై ఎగురుతున్న వస్తువును యూఎస్ ఎఫ్-22 ఫైటర్ జెట్ ద్వారా అమెరికా శనివారం కూల్చివేసిందని కెనడా వెల్లడించింది. తమ అనుమతి మేరకే అమెరికా ఈ వస్తువును కూల్చివేసినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. ఉత్తర కెనడాలోని, యుకోన్ ప్రాంతంలో కూల్చివేత జరిగిందని ఆయన తెలిపారు.

US fighter jet: ఇటీవలే చైనాకు చెందిన స్పై బెలూన్‌ను అమెరికా పేల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే మరో గుర్తు తెలియని వస్తువును అమెరికా కూల్చివేసింది. కెనడా గగనతలంపై గుండ్రని ఆకారంలో ఉన్న గుర్తు తెలియని వస్తువును అమెరికా యుద్ధ విమానాలు కూల్చివేశాయి.
తమ గగనతలంపై ఎగురుతున్న వస్తువును యూఎస్ ఎఫ్-22 ఫైటర్ జెట్ ద్వారా అమెరికా శనివారం కూల్చివేసిందని కెనడా వెల్లడించింది. తమ అనుమతి మేరకే అమెరికా ఈ వస్తువును కూల్చివేసినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. ఉత్తర కెనడాలోని, యుకోన్ ప్రాంతంలో కూల్చివేత జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం ఈ వస్తువుకు చెందిన శిథిలాల్ని సేకరించినట్లు, వాటిని విశ్లేషణ కోసం తరలించినట్లు ట్రూటో చెప్పారు. గత వారం చైనా స్పై బెలూన్ అమెరికా తీర ప్రాంతంలో ఎగరడం సంచలనం సృష్టించింది. దీన్ని అమెరికన్ యుద్ధ విమనాలు పేల్చివేశాయి.
Turkey Earthquake: టర్కీలో భూకంపం.. ఆస్పత్రిలో శిశువుల్ని కాపాడేందుకు నర్సులు ఏం చేశారంటే?
ఇప్పుడు కెనడాలో కూల్చిన వస్తువు రెండోది. ఈ వస్తువు ఏ దేశానికి చెందిందో, దాని వివరాలు ఏంటో చెప్పేందుకు కెనడా రక్షణ మంత్రి అనితా ఆనంద్ నిరాకరించారు. అయితే, ఈ వస్తువు చైనా స్పై బెలూన్ కంటే చిన్నదిగా ఉంది. 40,000 అడుగుల ఎత్తులోనే ఈ వస్తువు ఎగురుతుండటంతో, ఇది విమానాల ప్రయాణాలకు ఇబ్బంది కలిగిస్తుందనే ఉద్దేశంతోనే పేల్చివేసినట్లు కెనడియన్ అధికారవర్గాలు తెలిపాయి. దీన్ని అలస్కా తీరంలోని అమెరికా తీర రక్షణ విభాగం శుక్రవారం గుర్తించినట్లు అమెరికా తెలిపింది.
నెమ్మదిగా దూసుకొచ్చిన ఈ వస్తువు కెనడా ఏరోస్పేస్ దాటిందని, దీంతో కెనడాకు చెందిన యుద్ధ విమానాలు కూడా దీన్ని అనుసరించాయని అమెరికా వెల్లడించింది. ఏఐఎమ్ 9ఎక్స్ మిస్సైల్ ఉపయోగించి, దీన్ని అమెరికా పేల్చివేసింది.