One Second Corona Test Result : ఒకే ఒక్క సెకనులో కరోనా ఉందో లేదో తెలిపే పరీక్ష

One Second Corona Test Result : ఒకే ఒక్క సెకనులో కరోనా ఉందో లేదో తెలిపే పరీక్ష

Us, Florida University Researchers,one Second,corona Test Result,

One second new corona test result : కరోనా సోకిందో లేదో నిర్ధారించే టెస్టుల్లో చాలా రకాలు ఉన్నాయి. RT-PCR టెస్ట్,ర్యాపిట్ ఆంటిజెస్, ట్రూనాట్ టెస్ట్,HRCT-LUNGS (సిటిస్కాన్) వంటివి ఉన్నాయి. టెస్టులు ఎన్ని ఉన్నా..ఫలిలాలు రావటానికి సమయం పడుతోంది. దీంతో టెస్టులు చేయించుకున్నవారు తమకు కరోనా సోకిందా? లేదా?రిపోర్టు పాజిటివ్ అని వస్తుందా? లేదా నెగిటివ్ అని వస్తుందా? అనే సందేహంలో పడుతున్నారు. దీంతో రిపోర్టు వచ్చేవరకూ వారు టెన్షన్ పడుతున్నారు. అదేకాకుండా టెస్టు చేయించుకున్నాక..రిపోర్టు వచ్చేవరకూ తాము ఐసోలేషన్ లో ఉండాలా? లేదా? తమ పనులు తాము చూసుకోవచ్చా? అనే మీమాంసలో పడిపోతున్నారు.

అదే టెస్ట్ చేయించుకున్న వెంటనే ఫలితాలు తెలిస్తే చేయించుకున్నవారికి ఫుల్ క్లారిటీగా ఉంటుంది.దీంతో వారు ఐసోలేషన్ లో ఉండాలా? లేదా ఆస్పత్రిలో జాయిన్ అయి ట్రీట్ మెంట్ చేయించుకోవాలా? అనేది నిర్ధారించుకోగలుగుతారు. అటువంటి సౌకర్యం ఉంటే కరోనా కేసులు కూడా తగ్గే అవకాశాలున్నాయి. నిజమే. అటువంటి అద్భుతమైన టెస్టును అంటే కేవలం ‘ఒకే ఒక్క సెకను’లో కరోనా సోకిందా? లేదా? అని నిర్ధారించే టెస్టును అందుబాటులోకి తీసుకొచ్చారు అమెరికాలోని ఫ్లోరిడా వర్సిటీ పరిశోధకులు.

కాగా..ప్రస్తుతం కరోనా టెస్టులు చేస్తే ఫలితం కోసం ఒక రోజు వేచి చూడాల్సివస్తోంది. కానీ ఒక్క సెకనులో కరోనా ఉందో, లేదో చెప్పేసే సరికొత్త పరీక్ష విధానానికి అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం పరిశోధకులు అత్యంత వేగంగా కరోనా ఫలితం తెలిపే సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ సరికొత్త పరీక్షా విధానంలో బయో సెన్సర్ స్ట్రిప్ ద్వారా కరోనా పరీక్షలు చేస్తారు. కరోనా లక్షణాలున్న వ్యక్తి లాలాజలం అంటే ఉమ్మి ద్వారా వారికి కరోనా సోకిందా? లేదా అనేది నిర్ధారణ చేస్తారు. బయో సెన్సర్ స్ట్రిప్ గ్లూకోజ్ టెస్ట్ స్ట్రిప్ ను పోలి ఉంటుందని ఫ్లోరిడా వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. తాము రూపొందించిన కొత్త విధానంతో కరోనా పరీక్షల సమయం, ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుందని తెలిపారు.