Russia vs Ukraine War: యుక్రెయిన్‌కు బ్రాడ్లీ యుద్ధ వాహనాలు.. భారీగా రక్షణ ప్యాకేజీని ప్రకటించిన అమెరికా..

రష్యాకు వ్యతిరేకంగా కొత్తదశ యుద్ధానికి యుక్రెయిన్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ యుక్రెయిన్ కోసం 2.5 బిలియన్ డాలర్ల రక్షణ ప్యాకేజీని ప్రకటించింది. ప్యాకేజీలో 59 బ్రాడ్లీ యుద్ధ విమానాలు కూడా ఉన్నట్లు యూఎస్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.

Russia vs Ukraine War: యుక్రెయిన్‌కు బ్రాడ్లీ యుద్ధ వాహనాలు.. భారీగా రక్షణ ప్యాకేజీని ప్రకటించిన అమెరికా..

Bradley Fighting Vehicles

Russia vs Ukraine War: యుక్రెయిన్‌పై రష్యా దళాలు విరుచుకుపడుతున్నాయి. క్షిపణుల దాడులతో యుక్రెయిన్‌లోని పలు ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఏడాదికాలంగా యుద్ధం కొనసాగుతుండటంతో వేలాది మంది మృత్యువాత పడ్డారు. గతకొద్దిరోజులుగా రష్యా తన దూకుడును మరింత పెంచింది. ఈ క్రమంలో రష్యాకు వ్యతిరేకంగా కొత్తదశ యుద్ధానికి యుక్రెయిన్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ యుక్రెయిన్ కోసం 2.5 బిలియన్ డాలర్ల రక్షణ ప్యాకేజీని ప్రకటించింది. సంవత్సరం క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యూఎస్ ఇప్పటి వరకు 26.7 బిలియన్ డాలర్ల భద్రతా సహాయాన్ని యుక్రెయిన్‌కు అందించినట్లయింది.

Helicopter crash In Ukraine : కుప్పకూలిన హెలికాప్టర్..యుక్రెయిన్ హోంమంత్రితో సహా 18 మంది మృతి

అమెరికా ప్రకటించిన రక్షణ ప్యాకేజీలో యుక్రెయిన్ కు వందలాది సాయుధ వాహనాలతో పాటు రాకెట్లు, ఫిరంగి షెల్స్ ఉన్నాయి. ఈ ప్యాకేజీలో 59 బ్రాడ్లీ యుద్ధ విమానాలు, 90 స్ట్రైకర్ ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్స్, 53 మైన్ రెసిస్టెంట్ ఆంబుష్ ప్రొటెక్టెడ్ వెహికిల్స్, 350 హై మొబిలిటీ మల్టీపర్పస్ వీల్డ్ వెహికల్స్ ఉన్నాయని యూఎస్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే రష్యా దాడిని ఎదుర్కొంటున్న యుక్రెయిన్ కు బ్రాడ్లీ యుద్ధ వాహనాలను అందించాలని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ వెల్లడించారు. జో బెడెన్ పేర్కొన్నట్లుగా గురువారం అమెరికా భారీ ఆయుధ ప్యాకేజీని యుక్రెయిన్ అందిస్తున్నట్లు ప్రకటించింది.

Helicopter crash In Ukraine: యుక్రెయిన్‌ హెలికాప్టర్ ప్రమాదంలో రష్యా ప్రమేయం ఉందా? జెలెన్ స్కీ వాదన ఏమిటంటే ..

రష్యా దళాల చర్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు యుద్ధ ట్యాంకులు, దీర్ఘశ్రేణి క్షిపణలు, ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు అందించాలంటూ అమెరికాపై గతకొద్దికాలంగా యుక్రెయిన్ ఒత్తిడి తెస్తోంది. ఈ విషయాన్ని అమెరికా ప్రెసిడెంట్ జో బెడెన్ చెప్పారు. అయితే, బ్రాడ్లీ మధ్యశ్రేణిసాయుధ పోరాట వాహనాలు పంపించేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ వాహనాలు చక్రాలతో కాకుండా ట్రాక్స్ ఆధారంగా నడుస్తాయి. తేలికపాటిదే అయినా ట్యాంకు కంటే చురుగ్గా ఉంటుంది. ఇందులో 10 మంది సైనికులు సురక్షితంగా ప్రయాణించొచ్చు. బ్రాడ్లీ వాహనాలను అమెరికా సైన్యం ఇప్పటికీ వినియోగిస్తోంది.