USS Gerald R Ford : అమెరికా నేవీ టెస్ట్ కారణంగా భూకంపం

అమెరికా నేవీ తమ కొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్(USS Gerald R. FORD)పై వరుస టెస్ట్ లు నిర్వహించడం ప్రారంభించింది.

USS Gerald R Ford : అమెరికా నేవీ టెస్ట్ కారణంగా భూకంపం

Us Navy

USS Gerald R Ford అమెరికా నేవీ తమ కొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్(USS Gerald R. FORD)పై వరుస టెస్ట్ లు నిర్వహించడం ప్రారంభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ క్యారియర్ లలో ఒకటైన ఈ నౌక ప్రతికూల పరిస్థితుల్లో(యుద్ధ సమయాల్లో పేల్చేయడం వంటివి)శక్తివంతమైన పేలుడు పదార్థాలను తట్టుకోగలదా లేదా.. మిషన్ అవసరాలను తీర్చగలదా లేదా అని నిర్థారించేందుకు శుక్రవారం అట్లాంటిక్ సముద్రంలో ఫుల్ షిప్ షాక్ ట్రయిల్స్(FSST) నిర్వహించారు.

ఈ ట్రయిల్ లో భాగంగా నౌకకి కొద్ది మీట్లర్ల దూరంలోనే దాదాపు 20 టన్నుల భారీ పేలుడు పదార్థాలను బ్లాస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను యూఎస్ నేవీ ఆదివారం రాత్రి విడుదల చేసింది. పేలుడు జరిగిన వెంటనే నీటి తుఫాన్ సంభవించినట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. కాగా షిప్ మాత్రం ఏ మాత్రం తొణకలేదు. అయితే ఈ పేలుడు కారణంగా ఫ్లోరిడా తీరానికి 161 కిలోమీటర్ల దూరంలో 3.9తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కాగా,333 మీటర్ల పొడవు,77 మీటర్ల ఎత్తు కలిగిన ఈ అత్యాధునిక నౌక..100,000టన్నులను మోసుకెళ్లే సమార్థ్యం కలిగి ఉంది.