China-Taiwan : తైవాన్ చైనాలో అంతర్భాగమే..కాదంటే యుద్ధం తప్పదు..ఎవ్వరిని లెక్క చేసేదేలేదంటున్న డ్రాగన్ దేశం

తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమే. మా దేశాన్ని కాదని తైవాన్ తనకు తాను స్వతంత్రం ప్రకటించుకున్నా...ఎవరన్నా అందుకు సహకరించినా యుద్ధం తప్పదు. అంటూ చైనా అమెరికాను ఉద్దేశించి హెచ్చరించింది.

China-Taiwan : తైవాన్ చైనాలో అంతర్భాగమే..కాదంటే యుద్ధం తప్పదు..ఎవ్వరిని లెక్క చేసేదేలేదంటున్న డ్రాగన్ దేశం

China Taiwan America

China-Taiwan-America : తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమే. మా దేశాన్ని కాదని తైవాన్ తనకు తాను స్వతంత్రం ప్రకటించుకున్నా…ఎవరన్నా అందుకు సహకరించినా యుద్ధం తప్పదు. తైవాన్ కోసం ఎంతవరకైనా పోరాడడం తప్ప చైనా ఆర్మీ ముందు మరో మార్గం లేదు. అమెరికాను ఉద్దేశించి డ్రాగన్ చేసిన హెచ్చరిక ఇది. ఈ వ్యాఖ్యలు గమనిస్తే…రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిసిపోకముందే మరో యుద్ధం మొదలవుతుందేమోనన్న భయాందోళన వ్యక్తమవుతోంది. చైనా యుద్ధ కాంక్షతో రగిలిపోతున్న విషయం అర్ధమవుతుంది.

తైవాన్‌పై చైనా యుద్ధం చేసే అవకాశముందా…? తైవాన్ దురాక్రమణకు డ్రాగన్ అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటోందా..?? ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని పదే పదే అమెరికాకు పంపుతోందా…? చైనా నేతల వ్యాఖ్యలు గమనిస్తే ఈ సందేహాలే కలుగుతున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభం కాకముందు నుంచే..చెప్పాలంటే గత ఏడాది నుంచే చైనా తైవాన్ ఆక్రమణకు ప్రయత్నిస్తుందన్న భావన నెలకొంది. తైవాన్ చైనాలో అంతర్భాగమని, చైనా సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకుంటామని అధ్యక్షుడు జిన్ పింగ్ పదే పదే చెప్పారు. గత ఏడాది నుంచి తైవాన్ గగనతలంలో చైనా విమానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దీంతో తైవాన్‌పై చైనా ఏ క్షణమైనా దాడిచేసే అవకాశముందన్నది అందరి అభిప్రాయం. అయితే యుక్రెయిన్‌లో అనుకున్నంత వేగంగా రష్యా లక్ష్యాన్ని చేరుకోకపోవడం, యుక్రెయిన్ నుంచి ఎదురయిన ప్రతిఘటన గమనించిన తర్వాత చైనా ఆలోచనల్లో మార్పు వచ్చిందని, తైవాన్‌ ఆక్రమణ ఆలోచన పక్కనపెట్టిందని భావించారు. కానీ అది నిజం కాదని తేలిపోయింది. తైవాన్‌ను చైనాలో అధికారికంగా అంతర్భాగం చేసుకోవాలన్న ఆలోచన నుంచి బీజింగ్ పక్కకు జరగలేదని అర్ధమయింది. సింగపూర్‌లో జరిగిన చైనా, బీజింగ్ రక్షణమంత్రుల సమావేశం అన్ని అంశాలపై స్పష్టతనిచ్చింది.

ఆసియా భద్రతపై జరిగిన సమావేశంలో తొలిసారి చైనా రక్షణమంత్రి వీ షింఘె, అమెరికా రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్‌ను కలిశారు. ఈ సమావేశంలోనే తైవాన్‌పై తమ వైఖరిని స్పష్టాతిస్పష్టంగా వెల్లడించారు ఫెంఘె. తైవాన్ స్వంతంత్రం ప్రకటించుకున్నా…తైవాన్‌ను చైనా నుంచి విడదీసేందుకు ఎవరన్నా ప్రయత్నించినా…యుద్ధం చేయడానికి తాము ఏ మాత్రం ఆలోచించబోమని షింఘె హెచ్చరించారు. ఇందుకోసం ఎంత మూల్యం చెల్లించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తైవాన్ స్వతంత్రం కోసం జరిగే ఏ ప్రయత్నాన్నీ సహించబోమని తేల్చిచెప్పారు. తైవాన్ అంటే చైనా తైవానే అని…తైవాన్‌ను అడ్డుపెట్టుకుని చైనాను నియంత్రించలేరని పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు వీ ఫెంఘె.

ఫెంఘె వ్యాఖ్యలపై సమావేశం అనంతరం అమెరికా రక్షణమంత్రి అభ్యంతరం వ్యక్తంచేశారు. తైవాన్‌ను అస్థిరపరిచే చర్యలు బీజింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చైనా తైవాన్ మధ్య యథాతథస్థితి కొనసాగించేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఆస్టిన్ చెప్పారు.

అమెరికా వ్యాఖ్యలను ఫెంఘె తప్పుపట్టారు. చైనాతో ప్రమాదముందని, చైనాను శత్రువని భావించడం చారిత్రక, వ్యూహాత్మకమైన తప్పుగా అభివర్ణించారు. చైనా-అమెరికా సంబంధాలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. చైనా-అమెరికా బంధం, సహకారం, రెండు దేశాలకు, మిగిలిన ప్రపంచ శాంతికి ప్రయోజనకరమన్నారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, చైనా ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరించడం నిలిపివేయాలని అమెరికాకు సూచించారు. అమెరికా వైఖరి మారకపోతే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడబోవన్నారు. మొత్తానికి చైనా, అమెరికా రక్షణమంత్రుల మధ్య తొలిసారి గంటపాటు జరిగిన సమావేశంతో తైవాన్ సమస్యపై మరోసారి చర్చ మొదలయింది.