కరోనా లక్షణాలు లేకున్నా వైరస్ బాధితులను గుర్తించే యాప్

  • Published By: nagamani ,Published On : October 31, 2020 / 03:31 PM IST
కరోనా లక్షణాలు లేకున్నా వైరస్ బాధితులను గుర్తించే యాప్

USA asymptomatic covid cases app : కరోనా మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని గడగడలాడించేస్తోంది. కరోనా సోకిందని తెలీకుండానే ఆ లక్షణాలు కనిపించకుండానే ప్రాణాలు కోల్పోయినవారున్నారు. కరోనా వైరస్ సోకిందని తెలియకుండానే ప్రాణాల్ని హరించేస్తోంది. ఒక్కో వాతావరణంలో ఒక్కో వ్యక్తిలో ఒక్కోరకంగా కరోనా ఆడుకుంటోంది.


కరోనా లక్షణాలు కనిపిస్తే దీనికంటూ ఓ వ్యాక్సిన్ అనేది ఇప్పటి వరకూ అందుబాటులోకి రాకున్నా..ఇమ్యూనిటీ పెంచుకునే వైద్యం చేయించుకోవచ్చు. కానీ కరోనా లక్షణాలు చాలామందిలో కనిపించట్లేదు. ఇది కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఈక్రమంలో కరోనా లక్షణాలు లక్షణాలు కనిపించకుండానే మహమ్మారి బారిన పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు.


వారిలో ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించవు. టెస్టు చేయించుకుంటే మాత్రం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవుతుంది. వీరినే ‘‘అసింప్టొమేటిక్ కోవిడ్-19 పేషెంట్లు’’ అంటున్నారు. ఇలాంటి వారి కోసం శాస్త్రవేత్తలు కొత్తగా ఒక యాప్ ను తయారు చేశారు.



స్మార్ట్ ఫోన్ లో ఉండే ఈ యాప్ ను వినియోగించి ఎవరైనా సరే తమలో అసింప్టొమేటిక్ లక్షణాలు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అంటున్నారు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రీసర్చర్లు.



కరోనా లక్షణాలు కనిపించకపోయినా కరోనా సోకినవారిని గుర్తించే ఈ యాప్ ను అభివృద్ధి చేశారు అమెరికా పరిశోధకులు. ఒక వ్యక్తి దగ్గే తీరు, వారు మాట్లాడే తీరును బట్టి..సదరు వ్యక్తి అసింప్టొమేటిక్ పేషెంటా? కాదా? అని ఈ యాప్ నిర్ధారిస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యాప్ పని చేస్తుందని పరిశోధకులు తెలిపారు.


తమకు కనోనా సోకిందా లేదాని తెలుసుకోవాలనుకునేవారు తాము పరీక్షించుకోవాలంటే..తమ దగ్గును, మాటలను వెబ్ బ్రౌజర్లు, సెల్ ఫోన్, ల్యాప్ టాప్ డివైజెస్ ద్వారా సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత వీటిని ఈ యాప్ తన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. తనలో ఉన్న వేలాది దగ్గులు, పదాల ఉచ్చారణలతో పోల్చి చూస్తుంది. ఆ తరువాత ఆ వ్యక్తికి కరోనా సోకిందా? అనే విషయాన్ని నిర్ధారిస్తుంది.


కరోనా పేషెంట్ల నుంచి రికార్డ్ చేసిన వేలాది దగ్గుల శబ్దాలను యాప్ లో ఫీడ్ చేశారు. కరోనా బారిన పడిన వారి 100 శాతం (అన్ని రకాలు) దగ్గులను ఇందులో చేర్చామని పరిశోధకులు తెలిపారు. దాని ద్వారా సదరు వ్యక్తి దగ్గును..మాట్లాడే తీరును బట్టి కరోనా సోకిందా లేదా అనే విషయాన్ని ఈ యాప్ నిర్ధారిస్తుందని తెలిపారు. ఈ యూజర్ ఫ్రెండ్లీ యాప్ ను ప్రజల ముందుకు తీసుకురావటానికి యత్నిస్తున్నామని పరిశోధకులు తెలిపారు.