ఛీ..ఛీ : రెస్టారెంట్ కిచెన్ లోనే మూత్రం పోసిన ఉద్యోగి

అమెరికాలో ఘోరం జరిగింది. ఓ రెస్టారెంట్ కిచెన్ లో ఉద్యోగి చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఉద్యోగి చేసిన వెధవ పని చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ

  • Published By: veegamteam ,Published On : December 17, 2019 / 04:03 PM IST
ఛీ..ఛీ : రెస్టారెంట్ కిచెన్ లోనే మూత్రం పోసిన ఉద్యోగి

అమెరికాలో ఘోరం జరిగింది. ఓ రెస్టారెంట్ కిచెన్ లో ఉద్యోగి చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఉద్యోగి చేసిన వెధవ పని చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ

అమెరికాలో ఘోరం జరిగింది. ఓ రెస్టారెంట్ కిచెన్ లో ఉద్యోగి చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఉద్యోగి చేసిన వెధవ పని చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ ఉద్యోగి ఏం చేశాడో తెలుసా.. రెస్టారెంట్ లోని కిచెన్ నే టాయ్ లెట్ గా మార్చేశాడు. కిచెన్ లో మూత్రం పోశాడు.

యుటాలోని(utah) డ్రాపర్ ప్రాంతంలో ది రాచెరిటోస్ మెక్సికన్ ఫుడ్ రెస్టారెంట్‌‌ లో ఈ ఘటన జరిగింది. ఓ ఉద్యోగి వంట గదిలో మూత్రం పోయడాన్ని రాబర్ట్ అనే వ్యక్తి వీడియో తీశాడు. దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అంతే.. ఈ వీడియో వైలర్ అయ్యింది. దీన్ని చూసిన కస్టమర్లు వాంతి చేసుకున్నంత పనైంది. తాము తింటున్నది ఇలాంటి రెస్టారెంట్ లోనా అని తల పట్టుకున్నారు. కాగా ఈ వీడియోని ఆహార తనిఖీ అధికారులు కూడా చూశారు. వెంటనే రంగంలోకి దిగి రెస్టారెంట్ లో తనిఖీలు చేశారు. ఆ తర్వాత రెస్టారెంట్ ను మూసివేయించారు.

దీనిపై ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఆహారాన్ని తయారు చేసే ప్రాంతంలో ఉద్యోగి మూత్రం పోయడం దారుణం అన్నారు. ఆ రెస్టారెంటును మూయించామన్నారు. యాజమాన్యం రెస్టారెంట్ మొత్తాన్ని శుభ్రం చేసి, ఫుడ్ ప్రొటెక్షన్ బ్యూరోను కలిసిన తర్వాతే మళ్లీ తెరవాల్సి ఉంటుందన్నారు. కాగా, ఈ పనికి పాల్పడిన ఆ ఉద్యోగిపై యాజమాన్యం చర్యలు తీసుకుంది. వెంటనే విధుల నుంచి తొలగించింది. ప్రస్తుతం రెస్టారెంట్‌ను శుభ్రం చేసే పనిలో ఉంది.

సాధారణంగా రోడ్డు పక్కన ఉండే షాపుల్లో శుచి, శుభ్రత ఉండదు అనేది చాలామంది నమ్మకం. అందుకే కాస్త పేరున్న రెస్టారెంట్లు, హోటళ్లు, ఈటరీస్ కి వెళ్తారు. అక్కడైతే క్లీన్ గా ఉంటుంది అనేది నమ్మకం. కానీ.. ఈ వీడియో చూశాక.. తమ నమ్మకం తప్పేమో అని సందేహిస్తున్నారు.