Vijay Mallya: అంత డబ్బున్నా కూడా పారిపోయాడట.. విజయ్ మాల్యా గురించి విస్తుపోయే నిజాలు చెప్పిన సీబీఐ

ఫ్రాన్స్‭(France)లో 35 మిలియన్ యూరోలతో రియల్ ఎస్టేట్ కొనుగోలు చేయడంతో పాటు తన కంపెనీల్లో ఒకటైన గిజ్మో హోల్డింగ్స్ ఖాతా నుంచి 8 మిలియన్ యూరోలు చెల్లించాడని సీబీఐ తన ఛార్జ్‭షీట్‭లో పేర్కొంది. 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా.. 2016లో దేశం విడిచి పెట్టి పారిపోయారు

Vijay Mallya: అంత డబ్బున్నా కూడా పారిపోయాడట.. విజయ్ మాల్యా గురించి విస్తుపోయే నిజాలు చెప్పిన సీబీఐ

Vijay Mallya had enough money to pay back loan says CBI

Vijay Mallya: బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచిపెట్టి పారిపోయిన కింగ్‭ఫిషర్ ఎయిర్‭లైన్స్ (Kingfisher Airlines) అధినేత విజయ్ మాల్యా (Vijay Mallya) గురించి కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విస్తుపోయే నిజాలు బయటపెట్టింది. వాస్తవానికి తీసుకున్న అప్పులు చెల్లించలేక మాల్యా దేశం విడిచి వెల్లారనే ఎక్కవ మంది ఇప్పటికీ నమ్ముతున్నారు. అయితే బ్యాంకులకు తిరిగి ఇచ్చేంత డబ్బు (Enough Money) మాల్యా దగ్గర ఉందట. కానీ చెల్లించే ఉద్దేశం లేదని, ఉన్న డబ్బునంతా విదేశాల్లో ఆస్తులుగా మలుచుకొని దేశం నుంచి చెక్కేసినట్లు సీబీఐ తన ఛార్జ్‭షీట్‭లో పేర్కొంది. ఇక అదే సమయంలో మాల్యా నుంచి అప్పు రికవరీ చేయడంలో బ్యాంకులు విఫలమైనట్లు సైతం తెలిపారు.

Khushi: ఖుషి ఇచ్చే వార్త చెప్పిన విజయ్ దేవరకొండ-సమంత!

దేశం వదిలిపోయి, యూకేలో తలదాచుకున్న లిక్కర్ కింగ్ మాల్యా(Liquor King Malya)ను తిరిగి రప్పించడానికి భారత్ (India) అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని ఆయన కేసుల్ని సీబీఐ విచారిస్తోంది. ఇక ఆ సంస్థ ఇచ్చిన ఛార్జ్‭షీట్(Charge sheet)‭లో.. 2008-17 మధ్య కింగ్‭ఫిషర్ ఎయిర్‭లైన్స్ కోసం విజయ్ మాల్యా భారీ మొత్తంలో రుణం తీసుకున్నారు. అయితే ఆ సమయంలో ఆయన వద్ద బ్యాంకు లోన్లు (Bank loans) తిరిగి చెల్లించేంత డబ్బు ఉంది. కానీ బ్యాంకు రుణాలు చెల్లించకుండా యూరప్‭(Europe)లోని అనేక ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు. దీనితో తన పిల్లలకు పాటు స్విట్జర్‭లాండ్‭(Switzerland)లో ఉన్న ట్రస్టలకు పెద్ద ఎత్తున డబ్బు తరలించినట్లు సీబీఐ గుర్తించింది.

Rent a Girlfriend: అచ్చట అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్‭ లభించును.. పార్ట్నర్‭గా పార్ట్ టైం డ్యూటీ

ఫ్రాన్స్‭(France)లో 35 మిలియన్ యూరోలతో రియల్ ఎస్టేట్ కొనుగోలు చేయడంతో పాటు తన కంపెనీల్లో ఒకటైన గిజ్మో హోల్డింగ్స్ (Gizmo holdings) ఖాతా నుంచి 8 మిలియన్ యూరోలు చెల్లించాడని సీబీఐ తన ఛార్జ్‭షీట్‭లో పేర్కొంది. 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా.. 2016లో దేశం విడిచి పెట్టి పారిపోయారు. దేశంలో మూడేళ్ల హంగామా అనంతరం 2019, జనవరి 5న ఆయనను పరారీలో(Fugitive) ఉన్న ఎగవేతదారుగా బాంబే ప్రత్యేక కోర్టు ప్రకటించింది. ఇక ఈ కేసులో గతంలో 11 మంది నిందితులను పేర్కొన్న సీబీఐ.. తాజాగా ఐడీబీఐ బ్యాంక్ మాజీ మేనేజర్ బుద్ధదేవ్ దాస్ గుప్తా((IDBI Bank Manager Budhadev Dasgupta)ను నిందితుల జాబితాలో చేర్చింది.