Rent a Girlfriend: అచ్చట అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్ లభించును.. పార్ట్నర్గా పార్ట్ టైం డ్యూటీ
గర్ల్ ఫ్రెండ్‌గా ఉండేందుకు ఒక రోజుకు ఒక్కో యువతి 145 డాలర్లు (చైనాలో 1,000 యువాన్లు) వసూలు చేస్తున్నారట. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే దీన్ని పార్ట్ టైం జాబ్‌గా యువతులు ఎంచుకుంటున్నారని స్టింగ్ ఆపరేషన్‌లో తేలింది. యువకులే కాదు, యువతులు సైతం దీని పట్ల ఆసక్తిగానే ఉన్నారని, వారి సంఖ్య కూడా పెరిగిపోతోందని సదరు వార్తా సంస్థ పేర్కొంది.

Chinese People Hiring Rent Girlfriend To Stop Parents Hassle
Rent a Girlfriend: జపాన్, యూరప్, చైనా వంటి దేశాల్లో యువత వివాహానికి దూరంగా ఉంటున్నారు. పెళ్లి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా రేపు, ఎల్లుండి అంటూ దాటవేస్తున్నారు. చైనాలో ఈ తంతు విపరీతంగా పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా వయసు పెరిగిన సింగల్స్ పసంగ్స్ వందల్లో కనిపిస్తున్నారు. జీవితాన్ని అలా సోలోగా గడిపేద్దామనుకుంటున్నారో ఏమో, వివాహం గురించి పెద్దగా ఆలోచించడమే లేదు. కానీ కుటుంబ సభ్యుల నుంచి ఈ విషయమై ఒత్తిడి బాగానే ఉంది. మరి కుటుంబ సభ్యులను బాధపెట్టకూడదు, అలా అని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.
అందుకే, గర్ల్ ఫ్రెండ్‌ని అద్దెకు (Rented Girlfriend) తీసుకుని తన జీవిత భాగస్వామిగా (Life Partner) కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తున్నారు. అందు కోసం ఎజెన్సీలను ఆశ్రయిస్తున్నారు అక్కడి యువత. చైనా(China)లో ప్రస్తుతం ఇది బాగా ట్రెండింగులో ఉంది. గర్ల్ ఫ్రెండ్స్‌ని అద్దెకు ఇచ్చే ఏజెన్సీలు (Agencies) సైతం చైనాలో విపరీతంగా పెరిగిపోయాయి. వాస్తవానికి ఇవేమీ బహిరంగంగా జరగడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యవహారం ఇది. అయితే ఒక వార్తా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్ (Sting Operation) ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది.