విమానాన్ని హైజాక్ చేశారు: డ్రిల్ వీడియోపై నెటిజన్ల ఫైర్

విమానాన్ని హైజాక్ చేశారు: డ్రిల్ వీడియోపై నెటిజన్ల ఫైర్

విమాన సర్వీసుల అధికారుల సాధారణంగా డ్రిల్స్ నిర్వహిస్తుంటారు. ఏదైనా ఆపదలో ప్రయాణికులు ఎలా స్పందించాలో చెప్పేందుకు ఉపయోగపడే డ్రిల్స్ వరకూ పరవాలేదు. కానీ, ఫుల్ టెన్షన్‌ తెప్పిస్తూ గుండె ఆగిపోయేంత పని చేసిన ఈ డ్రిల్ పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది ఆ విమాన సర్వీస్ యాజమాన్యం. ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతో అది జరుగుతున్నంతసేపు నిజంగా ఫ్లైట్ హైజాక్ అయ్యిందేమోనని నమ్మిన ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. 

అధికారులు వచ్చి ఇదంతా డ్రిల్.. అవగాహన కోసం జరిగిందని చెప్పేంత వరకూ వాళ్లు అలానే ఉండిపోయారు. మెక్సికన్ ఎయిర్ లైన్ అయిన ఇంటర్ జెట్ ఈ ఘనకార్యం చేసింది. అకస్మాత్తుగా చొరబడిన కిడ్నాపర్లలో నుంచి ఒకరు ఇంక టైం లేదు. ప్రయాణికులను ఒక్కొక్కరినీ చంపేద్దాం అని గట్టిగా కేకలు వేస్తుంటే విమానంలో ఉన్నవారికే కాదు వీడియో చూస్తున్న వాళ్లకు కూడా నిజమైన ఘటనలా అనిపిస్తుంది. 

అంతా అయిపోయాక అధికారులు వచ్చి ఇప్పుడు జరిగిందంతా ఎయిర్ పోర్టులో ఉండగానే జరిగింది. మనం గాల్లో లేము. ఇందులో ప్రభుత్వాధికారులు పాల్గొని ప్రయాణికులు ఆపద సమయంలో ఎలా ఉండాలో అనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించారు. డ్రిల్ జరుగుతున్నంతసేపు వీడియో కూడా రికార్డ్ అవుతూ ఉందని చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.