Naked Man In Goa Beach : బాబోయ్.. నగ్నంగా బీచ్‌లో తిరుగుతున్న వ్యక్తి, వీడియో వైరల్

గోవా బీచ్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ విదేశీయుడు నగ్నంగా తిరుగుతూ కనిపించాడు. దీంతో అక్కడి స్థానికులు విస్తుపోయారు. ఆ వ్యక్తి తీరుపై మండిపడ్డారు.

Naked Man In Goa Beach : బాబోయ్.. నగ్నంగా బీచ్‌లో తిరుగుతున్న వ్యక్తి, వీడియో వైరల్

Naked Man In Goa Beach : ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ గోవాకు నిత్యం ఎంతోమంది టూరిస్టులు వస్తుంటారు. దేశ విదేశాల నుంచి పర్యాటకులు గోవాకు వచ్చి బీచ్ లో ఎంజాయ్ చేస్తారు. నిత్యం పర్యాటకులతో గోవా ఎంతో సందడిగా ఉంటుంది. అలాంటి గోవా బీచ్ లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చేసిన పనికి అంతా నివ్వెరపోయారు. ఇంతకీ అతడేం చేశాడో తెలుసా.. బీచ్ లో నగ్నంగా సంచరించాడు.

గోవాలోని జీ-స్ట్రింగ్ థాంగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ విదేశీయుడు నూడ్ గా తిరుగుతూ కనిపించాడు. దీంతో అక్కడి స్థానికులు విస్తుపోయారు. ఆ వ్యక్తి తీరుపై మండిపడ్డారు. పబ్లిక్ గా ఇలా నగ్నంగా తిరగడాన్ని తప్పుపట్టారు. ఇదేం పాడు పని అని అతడితో గొడవకు దిగారు. ఎందుకిలా నగ్నంగా తిరుగుతున్నావ్ అంటూ ఆ వ్యక్తిని నిలదీశారు. ఆ వ్యక్తి తనది యూరప్ అని చెప్పాడు.

బీచ్ లో నగ్నంగా తిరుగుతున్న విదేశీయుడితో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. బీచ్ కు ఎంతోమంది మహిళలు, పిల్లలు వస్తుంటారని, ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. వెంటనే దుస్తులు ధరించాలని సూచించారు. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో భయపడిన ఆ విదేశీయుడు దుస్తులు ధరించాడు. విదేశీయుడు నగ్నంగా బీచ్ లో తిరుగుతున్న దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా, ఆ విదేశీయుడు ఇలా నూడ్ గా బీచ్ లో తిరగడం తొలిసారి కాదని, రెండేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో ఆ వ్యక్తి ఇలా చేశాడని స్థానికులు ఆరోపించారు. మరోసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే బుద్ధి చెబుతామని గ్రామస్తులు హెచ్చరించారు. బీచ్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు స్థానికులు.

”నువ్వెందుకు ఇలా చేస్తున్నావ్? ఇది కరెక్ట్ కాదు. ఇది మా గ్రామం. ఇక్కడ మా పిల్లలు, మహిళలు నివాసం ఉంటారు. నువ్వు పూర్తిగా డ్రెస్ వేసుకోవాలి. రెండేళ్ల క్రితం కూడా నువ్వు ఇలానే నగ్నంగా బీచ్ లో తిరిగావు. మరోసారి ఇలా చేయను అని అప్పుడు చెప్పావు. కానీ, మళ్లీ అదే తప్పు చేశావ్. మీ యూరప్ లోనూ నువ్వు ఇలానే నూడ్ గా తిరుగుతావా? నువ్వు మాటలతో చెబితే వినవు. పోలీసులకు ఫోన్ చేస్తాను” అని ఓ స్థానికులు..ఆ విదేశీయుడితో వాగ్వాదానికి దిగడం వీడియోలో రికార్డ్ అయ్యింది.