Aircraft Emits Sparks: గాల్లో విమానం నుంచి ఎగసిపడ్డ నిప్పురవ్వలు.. అయినా సేఫ్‌గానే ల్యాండింగ్.. వీడియోలో రికార్డు
విమానం గాల్లోకి ఎగరగానే దాన్నుంచి మంటలు ఎగసిపడ్డాయి. నిప్పు రవ్వలు నేల మీద పడ్డాయి. ఈ ఘటనలో విమానం ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదు. సేఫ్‌గానే ల్యాండ్ అయ్యింది.

Aircraft Emits Sparks: ఇటీవల విమానాలు తరచూ ప్రమాదానికి గురవుతున్నాయి. కానీ, ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి అప్రమత్తం అవ్వడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించడం లేదు. తాజాగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానం కూడా ప్రమాదానికి గురైంది.
IND vs AUS: నేడు ఆస్ట్రేలియాతో భారత్ రెండో టీ20.. సిరీస్ గెలవాలంటే నెగ్గాల్సిందే
గత బుధవారం సాయంత్రం విమానం న్యూయార్క్ ఎయిర్ పోర్టు నుంచి సావోపాలోకు బయలుదేరింది. అయితే, విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే అది చిన్న కుదుపులకు గురైంది. విమానం నుంచి మంటలు, నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. అయినప్పటికీ విమానం అలాగే గంటన్నర సేపు ప్రయాణించింది. దాదాపు 90 నిమిషాలు అట్లాంటిక్ సముద్రం మీదుగా ప్రయాణించి, ప్రమాదాన్ని గుర్తించి తిరిగి న్యూయార్క్ చేరుకుంది. విమానం నుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డప్పటికీ, ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా సేఫ్‌గా ల్యాండ్ కావడం విశేషం. ఈ విమానం నుంచి ఎగిసిపడ్డ నిప్పు రవ్వలు నేల మీద పడ్డాయి.
CM Nitish Kumar: సోనియాతో భేటీ కానున్న బిహార్ సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్
అయితే, ఈ ఘటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమానాలు పాతవి కావడం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని నెటిజన్లు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, తాజా ఘటనకు అసలైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే, ఈ తరహా విమానాల్ని మరిన్ని కొనేందుకు అమెరికా ఇప్పటికే అమెరికా ఆర్డర్ కూడా చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#UA149, a #United 777 experiences troubles upon its departure from #Newark Airport.
Video credit: IG | variablecraft
Read more: https://t.co/08mXl4AnEj pic.twitter.com/SEoicHPIqY
— AeroXplorer (@aeroxplorer) September 22, 2022