North Korea : దక్షిణకొరియా నుంచి వచ్చే బెలూన్ల వల్లే మా దేశంలోకి కోవిడ్ వ్యాపించింది : కిమ్ జోంగ్

దక్షిణకొరియా నుంచి వచ్చే బెలూన్ల వల్లే మా దేశంలోకి కోవిడ్ వ్యాపించింది అంటూ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఆరోపించారు.

North Korea : దక్షిణకొరియా నుంచి వచ్చే బెలూన్ల వల్లే మా దేశంలోకి కోవిడ్ వ్యాపించింది : కిమ్ జోంగ్

North Korea Blames Covid Outbreak On Balloons From South Korea

North Korean President Kim : నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి దక్షిణకొరియాపై విరుచుకుపడ్డారు. దక్షిణ కొరియా వల్లే మా దేశంలోకి కోవిడ్ వ్యాపించింది అంటూ కిమ్ ఆరోపణలు గుప్పించారు. ఇరు దేశాల సరిహద్దుల వెంట దక్షిణ కొరియా వైపు నుంచి వచ్చిన బెలూన్లు..ఇతర వస్తువుల కారణంగానే మా దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించింది అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోపించారు. దేశంలోకి కరోనా వ్యాప్తి చెందటానికి దక్షిణ కొరియాని బాధ్యులు చేస్తు ఆరోపణలు గుప్పించారు కిమ్.తమ దేశంలో కోవిడ్ వ్యాప్తికి విదేశీ వస్తువులే కారణం అయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తర కొరియా ప్రజలు సరిహద్దుల వెంబడి బెలూన్ల ద్వారా పంపే విదేశీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Also read : North Korea: నార్త్‌ కొరియాలో కరోనా విలయం.. కషాయాలు, టీలు తాగండి అంటూ సలహా

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను విమర్శిస్తూ వందల వేల ప్రచార కరపత్రాలను పంపిణీ చేయడానికి కార్యకర్తలు కొన్నాళ్లుగా సరిహద్దులో బెలూన్‌లను ఎగురవేస్తున్నారు. వాటి వల్లే ఉత్తరకొరియాలోకి కోవిడ్ వ్యాప్తి చెందింది అంటూ ఆరోపిస్తోంది నార్త్ కొరియా. కాగా..ఎన్నో ఏళ్లుగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య తీవ్ర స్థాయిలో శత్రుత్వం ఉంది. అది అంతకంతకూ పెరుగుతోంది.

రెండు దేశాల సరిహద్దుల వెంట కంచె ఉంటుంది. అయితే రెండు దేశాలకు చెందిన ప్రజలు సరిహద్దుల వెంట కాస్త పెద్ద బెలూన్లతో కర పత్రాలు, ఇతర సామగ్రిని పంపుకొంటుంటారు. పేదరికంతో అల్లాడే ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా ప్రజల నుంచి బెలూన్ల ద్వారానే సాయం కూడా అందుతుంటుంది. ఉత్తర కొరియా నుంచి ఏదైనా సమాచారం అందించేవారు ఇలా బెలూన్ల ద్వారానే ఇస్తుంటారు. అయితే ఇంతకు ముందు దక్షిణ కొరియా కొంతకాలం ఈ విధానాన్ని నిషేధించింది. ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో మరోసారి బెలూన్ల ఎగరవేసే కార్యక్రమం కొనసాగుతోంది. దీన్ని డైరెక్టుగా విమర్శించకుండా కోవిడ్ కు ఆ బెలూన్లే కారణం అంటోంది నార్త్ కొరియా ప్రభుత్వం.

Also read :  Kim Jong un: కరోనా ఎఫెక్ట్.. మొదటిసారి మాస్క్‌ ధరించిన కిమ్.. ఉత్తర కొరియాలో కరోనా విలయం..

ఉత్తర కొరియా ఆగ్నేయ ప్రాంతంలో సరిహద్దుల వెంట దక్షిణ కొరియా నుంచి వచ్చిన బెలూన్, వస్తువులను తాకడం వల్ల కరోనా వ్యాప్తి మొదలైందని ఉత్తర కొరియా పేర్కొంది. ఉత్తరకొరియాలో మొదట ఒక సైనికుడకి..ఓ చిన్నారికి కరోనా లక్షణాలు కనిపించాయని.. కానీ అప్పటికే రాకపోకల వల్ల దేశంలో వైరస్ వ్యాపించిందని ఆరోపించింది.