Kim Jong un: కరోనా ఎఫెక్ట్.. మొదటిసారి మాస్క్‌ ధరించిన కిమ్.. ఉత్తర కొరియాలో కరోనా విలయం..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు ప్రపంచ దేశాలు కొంచెం దూరంగా ఉంటాయి. నిత్యం అణుబాంబుల తయారీ గురించి కిమ్ జో్ంగ్ ప్రస్తావిస్తాడు. మా జోలికొస్తే ఒక్క అణుబాంబు వేస్తా అంటూ హెచ్చరిస్తాడు. ఒకానొక సమయంలో...

Kim Jong un: కరోనా ఎఫెక్ట్.. మొదటిసారి మాస్క్‌ ధరించిన కిమ్.. ఉత్తర కొరియాలో కరోనా విలయం..

North Korea

Kim Jong un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు ప్రపంచ దేశాలు కొంచెం దూరంగా ఉంటాయి. నిత్యం అణుబాంబుల తయారీ గురించి కిమ్ జో్ంగ్ ప్రస్తావిస్తాడు. మా జోలికొస్తే ఒక్క అణుబాంబు వేస్తా అంటూ హెచ్చరిస్తాడు. ఒకానొక సమయంలో అగ్రరాజ్యమైన అమెరికా సైతం కిమ్ జోంగ్ ఉన్‌తో మనకెందుకు అన్నట్లుగా వ్యవహరించిందంటే కిమ్ ఎంతటి నియంతో అర్థమవుతుంది. ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్ సైతం ఉత్తర కొరియాలో తన ప్రభావాన్ని చూపలేక పోయింది. రెండేళ్లుగా ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతుంటే ఉత్తర కొరియా ప్రజలకు మాత్రం మాస్క్, వ్యాక్సిన్ అవసరం రాలేదు.

Kim Jong Un: అట్లుంటది మనతోని.. న్యూస్‌ రీడర్‌ను ఆశ్చర్యపర్చిన కిమ్.. ఏకంగా బంగ్లానే రాసిచ్చేశాడు..

కానీ.. కరోనా వైరస్ నాకంటే మొండిదని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు అర్థమైనట్లుంది. ఉత్తర కొరియాలో కరోనా విజృంభిస్తుండటంతో ఎట్టకేలకు కిమ్ మాస్క్ ధరించాడు. ఉత్తర కొరియాలో కరోనా వైరస్ బారిన పడి ఇప్పటికే ఒకరు మృతి చెందారు. లక్షలాది మంది ప్రజలు జ్వరంతో బాధపడుతున్నారు. నార్త్ కొరియాలో నమోదైన మొదటి కరోనా కేసుకు సంబంధించిన వివరాలను ఆ దేశ అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది. ఉత్తరకొరియాలో నమోదైన తొలి కరోనా కేసులో రోగి పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. రాజధాని ప్యాంగాంగ్‌లో జర్వంతో మొత్తం 21 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. , వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. మృతుడిలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ.2ను గుర్తించినట్లు పేర్కొన్నది.

Kim Yo Jong : దక్షిణ కొరియాపై అణు దాడి చేస్తాం.. కిమ్ సోద‌రి హెచ్చరిక..!

అయితే ఆ దేశంలో గురువారం నాటికి 18వేల మంది ప్రజలు జ్వరంతో బాధపడుతున్నారని అధికారులు ప్రకటించారు. తాజాగా ఆ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగి 1,87,800కు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్ లో ఉన్నారని కిమ్ మీడియా ప్రచురించింది. కరోనా వైరస్‌తో వ్యక్తి మరణించినప్పుడే దేశవ్యాప్తంగా కిమ్ లాక్ డౌన్ విధించారు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఉత్తర కొరియాలో ఇప్పటి వరకు ఎవరూ వ్యాక్సిన్ తీసుకోలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తానని తెలిపినప్పటికీ కిమ్ ఒప్పుకోలేదు. ప్రస్తతం వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ప్రజలకు కిమ్ వ్యాక్సిన్ అందించే ప్రక్రియను చేపడతారా? లేదా అనేది వేచి చూడాల్సిందే.