జైళ్లోనే జీవితాంతం ఉంటామంటున్న ఖైదీలు

  • Published By: venkaiahnaidu ,Published On : April 7, 2019 / 09:39 AM IST
జైళ్లోనే జీవితాంతం ఉంటామంటున్న ఖైదీలు

సాధారంగా జైలు జీవితం అంటే అందరూ భయపడిపోతారు.నాలుగు గోడల మధ్య నరకం అని భావిస్తుంటారు.ఆ జైళ్లల్లో శిక్షలు అనుభవించినవాళ్లయితే పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అని చెప్తుంటారు.య అయితే ఓ జైలుకి వెళ్లిన ఖైదీలు మాత్రం ఆ జైలు వదిలిపెట్టేందుకు ఇష్టపడటం లేదు.జీవితాంతం ఆ జైళ్లోనే ఉండాలని కోరుకుంటున్నారు. ఎల్లలు కానరాని సముద్రం.. పచ్చటి ప్రకృతి… పక్షుల కిలకిలారాగాలు. మధ్యలో వందెకరాల జైలు. విశాలమైన గదులు. అత్యాధునిక సౌకర్యాలు.హాయిగా సముద్రగాలిలో అలా అలా బయట తిరగొచ్చు. ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌ల కోసం జిమ్, మానసిక ఉల్లాసానికి మ్యూజిక్ క్లాసులు.టైంకు తిండి బెడ్ దగ్గరకు వస్తుంది. జీవితంలో ఇంతకన్నా సుఖం ఎక్కడైనాఉంటుందా? భూలోక స్వర్గం అనిపించే ఆ జైలును వదులుకోవడానికి ఎవరికీ మనసొప్పుతుందా చెప్పండీ.

ఫసిఫిక్ మహాసముద్రంలోని మేరీ ఐల్యాండ్స్ లోని ఐస్లా మరియా మాడ్రే ఐలాండ్ లో మరియాస్ ఫెడరల్ ప్రిజన్(జైలు) ఉంది. మేరీ ఐలాండ్స్ మొత్తం మెక్సికో ఆధీనంలోనే ఉన్నాయి.1905లో కరడుగట్టిన నేరస్థుల్ని బంధించేందుకు ఈ జైలును కట్టారు. ఇక్కడికి చేరుకోవాలంటే మెక్సికో తీరం నుంచి పడవలో 8 గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే జైల్లో ఉండే ఖైదీలను ఫ్రీగా బయట తిరగనిస్తారు.దీవిలో మెక్సికో భద్రతా దళాలు అడుగడుగునా నిరంతరం కాపలా కాస్తుంటాయి.దీంతో ఖైదీలు తప్పించుకోవాలన్న ఆలోచనే చేయరు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో లెఫ్ట్ నాయకుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ మెక్సికో ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. ఐస్లా మారియామాడ్రే ఐలాండ్‌ లోని ఈ జైలుని కల్చరల్ సెంటర్‌ ‌‌‌‌‌‌‌గా మార్చాలని, దానికి మెక్సికన్ రచయిత,పొలిటికల్ యాక్టివిస్ట్ జోస్ రెవుల్టస్ పేరు పెట్టాలని ఆయన నిర్ణయించారు.1930ల్లో రెండుసార్లు జోస్ రెవుల్టర్ ఇక్కడ ఖైదీగా బందించబడ్డాడు. 110ఏళ్లకు పైగాచరిత్ర కలిగిన ఈ జైల్లో ఇప్పటి వరకూ 64 వేల మంది ఖైదీలను ఉంచారు. గతేడాది 584 మంది ఖైదీలను మెయిన్ ల్యాండ్‌ లో ఉన్న జైళ్లకు తరలిం చారు. ప్రస్తుతం 137 మంది ఖైదీలు ఇక్కడ ఉంటున్నారు. ప్రెసిడెంట్ నిర్ణయం తెలిసిన కొందరు ఖైదీలు జైలును వదిలేందుకు ససేమిరా అంటున్నారట. కేవలం ఖైదీలకే కాదు. జైల్లో పని చేసే సిబ్బంది, వాళ్ల  కుటుంబాలు కూడా ఐలాండ్‌ తో ప్రేమలో పడ్డాయి.హాయిగా బతుకుతున్న మమ్మళ్లి ఈ జైలు నుంచి పంపించివేయద్దంటూ అధికారులను వేడుకుంటున్నారు.