‘మలేరియా డ్రగ్‌ను కరోనా ట్రీట్‌మెంట్‌లో వాడకండి’

‘మలేరియా డ్రగ్‌ను కరోనా ట్రీట్‌మెంట్‌లో వాడకండి’

మలేరియా ట్రీట్‌మెంట్‌కు వాడే రెమెడెసివర్ డ్రగ్ ను కరోనా పేషెంట్లకు వాడొద్దని సూచిస్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ‘ఈ డ్రగ్ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుందని కన్ఫామ్ కాదని’ WHO నిపుణులు చెబుతున్నారు. గిలీడ్స్ కు చెందిన ఈ డ్రగ్.. కరోనా తొలి నాళ్లలో మంచి ఫలితాలు ఇచ్చినట్లు స్టడీలు చెప్పాయి.

ఇది వాడడం వల్ల రికవరీ టైం కూడా తగ్గిందని తెలిసింది. ఈ యాంటీవైరల్ డ్రగ్ ను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్రీట్‌మెంట్‌లోనూ వాడినట్లు సమాచారం. WHO ద్వారా చేసిన గ్లోబల్ ట్రయల్స్ లో రెమెడెసివర్ కారణంగా మరణాల రేటు మాత్రం తగ్గించడం లేదని తెలిసింది. మరో మూడు ట్రయల్స్ లో డేటాను రివ్యూ చేసి ఈ డ్రగ్ కారణంగా ఉత్తమ ఫలితాలు లేనట్లు తేల్చారు.



అక్టోబర్ 15న ఈ స్టడీ ఫలితాలు పబ్లిష్ అయ్యాయి. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారం తర్వాత ఈ డ్రగ్ కు ఆమోదం తెలిపింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ కథనం ప్రకారం.. హాస్పిటల్ లో చేరిన పేషెంట్లు రికవరీ అయిన టైం చాలా తగ్గిందట.

డబ్ల్యూహెచ్ఓ ట్రయల్స్ ను గిలీడ్ ప్రశ్నించింది. తమ వద్ద ఉన్న కీలకమైన డేటాను ఎందుకు బయటపెట్టలేదని అడిగింది. చాలా స్టడీస్ లో ఇదే తేలింది. రెమెడెసివర్ రికవరీ టైంను తగ్గించింది. ‘చాలా లిమిటెడ్ హాస్పిటల్ రిసోర్సెస్’ మాత్రమే ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాయి.

డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ విని మేం అసంతృప్తికి గురయ్యాం. ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు వెక్లూరీని తొలి యాంటీవైరల్ ట్రీట్ మెంట్ డ్రగ్ గా వాడారు. దాదాపు కొవిడ్ 19 చికిత్సలో 50దేశాలు ఇదే అనుసరించాయి.