Sriram Krishnan: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాల వెనుక ఓ భారతీయుడు!

మస్క్ సహాయకుల్లో ఒకరు. స్వయంగా తానే మస్క్‭కు టెంపరరీగా సహాయం చేస్తున్నట్లు ఓ ట్వీట్‭లో చెప్పుకొచ్చారు కృష్ణన్. ట్విట్టర్‭లో ఎడిట్ బటన్ సహా ప్రస్తుతం ఉన్న 280 క్యారెక్టర్ల పాలసీని ఇంకాస్తకు పొడగించడం, అకౌంట్ వెరిఫికేషన్ పాలసీ వంటి నిర్ణయాలు సహా ఇతర నిర్ణయాల్లో కొంత మంది గొప్ప వ్యక్తులతో కలిసి మస్క్‭కు సహాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Sriram Krishnan: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాల వెనుక ఓ భారతీయుడు!

Sriram Krishnan: ట్విట్టర్ విషయంలో ఎలాన్ మాస్క్ తీసుకునే నిర్ణయాలు ఈ మధ్య సంచలనంగా మారాయి. కొనుగోలుపై డీల్ మాట్లాడిన అనంతరం నుంచి తాజాగా ట్విట్టర్‭ను సొంతం చేసుకునే వరకు ఒక ఎత్తైతే.. పూర్తిగా చేతికి వచ్చాక వెంటనే ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా అనేక మంది ఉద్యోగుల్ని తొలగించడం మరొక ఎత్తైంది. సోషల్ మీడియాలో ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ.. మస్క్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై చాలా మంది అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే మస్క్ తీసుకునే ఈ నిర్ణయాల వెనుక కీలక పాత్ర పోషిస్తున్నది ఒక భారతీయుడట.

పేరు శ్రీరామ్ కృష్ణన్.. మస్క్ సహాయకుల్లో ఒకరు. స్వయంగా తానే మస్క్‭కు టెంపరరీగా సహాయం చేస్తున్నట్లు ఓ ట్వీట్‭లో చెప్పుకొచ్చారు కృష్ణన్. ట్విట్టర్‭లో ఎడిట్ బటన్ సహా ప్రస్తుతం ఉన్న 280 క్యారెక్టర్ల పాలసీని ఇంకాస్తకు పొడగించడం, అకౌంట్ వెరిఫికేషన్ పాలసీ వంటి నిర్ణయాలు సహా ఇతర నిర్ణయాల్లో కొంత మంది గొప్ప వ్యక్తులతో కలిసి మస్క్‭కు సహాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తాను టెక్ కంపెనీలు చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు ప్రపంచంపై, వాటిని నిర్వర్తించే మస్క్‭పై తీవ్ర ప్రభావాన్ని చూపగలవని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

NCP Chief Sharad Pawar: అనారోగ్యంతో బాధపడుతున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ముంబైలోని ఆస్పత్రికి తరలింపు

అయితే ఈ శ్రీరామ్ కృష్ణన్ ఎవరనే దానిపై కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. పేరు చూస్తేనే ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తని చెప్పేయొచ్చు. ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలో జన్మించిన ఆయన 2001 నుంచి 2005 వరకు ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్‭లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రాం మేనేజర్‭గా తన కెరీర్ ప్రారంభించారు. అనంతరం డైరెక్ట్ రెస్పాన్స్ యాడ్స్ బిజినెస్, డిస్‭ప్లే అడ్వర్టైజింగులో అతిపెద్ద నెట్‭వర్క్‭లలో ఒకటైన మెటా, స్నాప్‭చాట్ సహా వివిధ మొబైల్ యాడ్ ప్రోడక్టులను తయారు చేశారు.

ఇవన్నీ చేస్తూనే వెంచర్ క్యాపిటలిస్ట్‭గా ఎదిగారు. 2021లో ఆయన భార్య ఆర్తి రామమూర్తి స్టార్టప్‭ల నుంచి వెంచర్ క్యాపిటలిజం, క్రిప్టోకరెన్సీల వరకు అన్నింటిపై చర్చలు జరిపేందుకు క్లబ్‭హౌజ్ టాక్ షోను ప్రారంభించారు. ఆమెనే హోస్టుగా వ్యవహరించిన ఆ షోకి ఎలాన్ మస్క్ గెస్టుగా వచ్చారు. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో ట్విట్టర్ విషయంలో శ్రీరామ్ కృష్ణన్ సలహాల్ని మస్క్ తీసుకుంటున్నట్లు సమాచారం.

Gujarat Bridge Collapse: మోర్బీలో తీగల వంతెన ఎలా కూలిపోయింది.. ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే..