Laughing Buddha : ఎవరీ లాఫింగ్ బుద్ధా .? ఆయనకు ఎందుకా పేరు వచ్చిందో తెలుసా..?

ముద్దుగా, బొద్దుగా బుజ్జి బొజ్జతో, బుగ్గన సొట్టలతో బోసి నవ్వులతో ఉండే లాఫింగ్ బుద్ధా బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. కుదమట్టంగా ఉండే లాఫింగ్ బుద్ధా బొమ్మ ఇళ్లలోనే కాదు కార్యాలయాల్లోను, వ్యాపారాలు చేసేచోట్ల పెట్టుకోవటం చూస్తుంటాం. లక్కీని తెచ్చి పెట్టే ఈ లాఫింగ్ బుద్ధా ఎవరు..?ఆయనకు ఆ పేరు ఎందుకొచ్చిందో తెలుసా..?

Laughing Buddha : ఎవరీ లాఫింగ్ బుద్ధా .? ఆయనకు ఎందుకా పేరు వచ్చిందో తెలుసా..?

Laughing Buddha

Laughing Buddha : లాఫింగ్ బుద్ధా(Laughing Buddha). ఈ బొమ్మ గురించి తెలియనివారు ఉండరు. ఎంత ఒత్తిడితో ఉన్నా..ఆందోళనతో ఉన్నా..లాఫింగ్ బుద్ధా బొమ్మను చూస్తే ఆటో మేటిక్ గా మనం ముఖంలోకి నవ్వు వచ్చేస్తుంది. ముద్దుగా, బొద్దుగా బుజ్జి బొజ్జతో, బుగ్గన సొట్టలతో నవ్వుతు ఉండే లాఫింగ్ బుద్ధా బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. కుదమట్టంగా ఉండే లాఫింగ్ బుద్ధా బొమ్మ ఇళ్లలోనే కాదు కార్యాలయాల్లోను, వ్యాపారాలు చేసేచోట్ల పెట్టుకోవటం చూస్తుంటాం. లాఫింగ్ బుద్ధా బొమ్మలు పలు రకాల ఆకృతుల్లో ఉంటాయి. కూర్చుని ఉన్న బొమ్మలు,నిలబడి ఉన్న బొమ్మలు, చేతిలో బంగారు నాణాలు జాలువారుతున్నట్లు,రెండు చేతులను ఎత్తి నట్లుగా,బుజ్జి బుజ్జి లాఫింగ్ బుద్ధాలతో పెద్ద లాఫింగ్ బుద్ధా ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆకృతుల్లో ఉంటాయి. చైనా, జపాన్, థాయ్ లాండ్ వంటి దేశాల్లో లాఫింగ్ బుద్ధాను చాలా పవిత్రంగా చూస్తారు.

లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో పెట్టుకోవడం చాలా శుభప్రదం అని చెబుతుంటారు. కానీ లాఫింగ్ బుద్ధ విగ్రహం అలంకార వస్తువు కాదు అదృష్టం తెచ్చే దైవంగా కూడా భావిస్తారు. తన బోసి నవ్వులతో అందరి మనస్సులను దోచుకుంటున్న ఈ బుజ్జి బుద్ధా నవ్వుల వెనుక చాలా ఆసక్తికర విషయం ఉంది. ఎన్నో ప్రత్యేకతలు..అదృష్టాలు తెచ్చి పెడతాయని నమ్మే లాఫింగ్ బుద్ద ఎవరు? ఆయనకు ఆ పేరు ఎందుకొచ్చిందో తెలుసుకుందాం..

Laughing Buddha : లాఫింగ్ బుద్ధా ఇంట్లో ఉంటే నిజంగానే అదృష్టం వరిస్తుందా..?

లాఫింగ్ బుద్ధా జపాన్ నివాసి హోతాయ్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. హోతాయ్ కఠోర తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడట. జ్ఞానం సంపాదించిన తర్వాత హొతాయ్ ముఖంలో సంతోషంతో కూడిన స్వచ్ఛమైన నవ్వు విరిసిందట. అలా చిరునవ్వుతో మొదలైన ఆ నవ్వు బిగ్గరగా పెరిగి అదే పనిగా నవ్వడం మొదలుపెట్టాడు. జీవితంలో ప్రజలను నవ్వించడానికే పని చేస్తానని నిర్ణయించుకున్నాడట. అలా ప్రజల్నినవ్వించటానికి హొతాయ్ ఎన్నో దేశాలు తిరిగాడు. అలా తన నవ్వుల్ని పంచిపెట్టాడు. బాధలో ఉన్నవారిని కూడా నవ్వించేవాడు. అలా అతను ఎక్కడికెళ్లినా అక్కడివారిని నవ్విస్తుండేవాడు. ప్రజలను నవ్విస్తూ, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపాడు. అందుకే లాఫింగ్ బుద్ధ అనే పేరు వచ్చింది.

ఇంటికి పట్టిన చెడు దృష్టి పోవాలంటే ఇంట్లో లాఫింగ్ బుద్ధా బొమ్మ ఉండాలి. సంతోషం, శాంతి తీసుకువచ్చే లాఫింగ్ బుద్ధా, అదృష్టాన్ని తెచ్చే లాఫింగ్ బుద్ధా,బంగారు నాణేల సంచితో లాఫింగ్ బుద్ధతో అదృష్టం, వ్యాపారాల్లో నష్టాలు పోయి లాభాలు రావాలంటే లాఫింగ్ బుద్ధా ఇలా ఒక్కో సందర్భానికి ఒక్కో రకం బొమ్మల్ని పెట్టుకుంటారు. ఒక్కో ఆకృతికి ఒక్కో అర్థం కలిగిన లాఫింగ్ బుద్ధా బొమ్మలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రాచుర్యాన్ని పొందాయి.