Cardiac Arrest : బాత్‌రూమ్‌లోనే గుండెపోట్లు ఎక్కువగా రావడానికి కారణమిదే

చాలామంది బాత్రూమ్‌ల‌లోనే హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. దీనికి కారణం ఏమిటి..? గుండెపోటు మ‌ర‌ణాలు బాత్రూమ్‌ల‌లోనే ఎక్కువ‌గా ఎందుకు

Cardiac Arrest : బాత్‌రూమ్‌లోనే గుండెపోట్లు ఎక్కువగా రావడానికి కారణమిదే

Cardiac Arrest

Cardiac Arrest : ఒక‌ప్పుడు వ‌య‌సుపైబడిన వారికి మాత్ర‌మే గుండెపోటు వ‌చ్చేది. కానీ, ఇప్పుడు అలా కాదు. వయసుతో సంబంధం లేదు. పాతికేళ్ల యువత కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. అయితే, చాలామంది బాత్రూమ్‌ల‌లోనే హార్ట్ ఎటాక్ తో కుప్ప‌కూలుతున్నారు. మ‌రి దీనికి కారణం ఏమిటి..? గుండెపోటు మ‌ర‌ణాలు బాత్రూమ్‌ల‌లోనే ఎక్కువ‌గా ఎందుకు సంభ‌విస్తున్నాయి..? అసలు పొరపాటు ఎక్కడ జరుగుతోంది? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు బాత్రూమ్‌కు వెళ్లిన‌ప్పుడే గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంది. అమెరికా ఏజెన్సీ NCBI లెక్కల ప్రకారం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 11 శాతం గుండెపోటు మరణాలు బాత్రూమ్‌ల‌లోనే చోటుచేసుకుంటున్నాయి. దాంతో బాత్రూమ్‌ల‌లోనే గుండెపోటు మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌టానికి గ‌ల కార‌ణాల‌ను నిపుణులు వెల్ల‌డించారు.

”స్నానం చేసేట‌ప్పుడు చాలామంది ముందుగా తలని తడుపుకుంటారు. దానివ‌ల్ల‌ వేడి ర‌క్తం గ‌ల‌ శరీరం ఒక్కసారిగా చల్లటి ఉష్ణోగ్ర‌త‌ను బ్యాలెన్స్ చేసుకోలేక‌పోతుంది. అన్ని వైపుల నుంచి త‌ల భాగం వైపు ర‌క్త ప్ర‌స‌ర‌ణ పెరుగుతుంది. ఆ సమయంలో ర‌క్త నాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటు వస్తుంది. శీతాకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి” అని నిపుణులు వెల్లడించారు.

అందుకే స్నానం చేసేటప్పుడు ముందుగా పాదాలను త‌డుపుకుని ఆ త‌ర్వాత పైవైపునకు వెళ్ల‌డం మంచిదని నిపుణులు సూచించారు. ముఖ్యంగా అధిక ర‌క్త‌పోటు, అధిక కొలెస్ట్రాల్‌, మైగ్రేన్‌తో బాధ‌ప‌డుతున్న వారు ఈ విధానాన్ని పాటించాలన్నారు. ఇక మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు విస‌ర్జ‌ణ స‌మ‌యంలో బాత్రూమ్‌లో ముక్కుతుంటారు. ఇలా చేసిన‌ప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలో గుండె సంబంధ రోగుల‌తోపాటు మలబద్ధకంతో బాధపడే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని, తల పైనుంచి స్నానం చేసే పద్దతిని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.